పుట:Naajeevitayatrat021599mbp.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్యక్షుడుగా ఎవరుంటే బాగుంటుందని మీమాంస వచ్చింది. కాంగ్రెసే గనుక రాజ్యాంగాన్ని చేపట్టడానికి అంగీకరించిఉంటే, ఎన్నుకోబడిన నాయకుడే ఎకబిగిని ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని ఇటువంటి పద్దతులకు కాంగ్రెసు కార్యనిర్వహణ విధానంలో తావే లేదుకదా! అందువలననే తాను అధ్యక్షస్థానం వహిస్తానని నరసింహరాజుగారు ముందు కొచ్చారు.

కాంగ్రెసు కార్యక్రమాన్ని సవ్యంగా నడప శక్తిలేని పరిస్థితులలో వారు ఒక "బినామీ" మంత్రివర్గాన్ని యేర్పరచారు. కాంగ్రెసు ఆదేశాలకు విరుద్ధంగా, దానికి అవసర సహకారం అందిస్తామన్నారు. మంత్రుల జీతాల విషయమూ, బడ్జెట్టూ చర్చకు వచ్చిన సందర్భంలో సందిగ్ద స్థితిలో పడ్డారు. చేయగలిగింది లేక, కొంతమంది శాసనసభా ప్రాంగణం నుంచి వెలుపలకు వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బడ్జెటు చర్చ ఆరంభదశలోనే మద్రాసు శాసనసభ కాంగ్రెసుపార్టీవారు కాంగ్రెసుకూ, దేశానికికూడా ద్రోహం చేశారు.

మూలపడిన విశ్వాసరాహిత్య తీర్మానం

ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెసువారికి పార్టీని రద్దుచేసే అధికారం ఉందిగాని అల్లా జరుగలేదు. బొంబాయిలో జరిగిన (మే 15-16) అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో మద్రాసు శాసన సభా సభ్యులుగా ఉంటూన్న కాంగ్రెసు వారిమీద ఉ. గోపాలమేనోన్ విశ్వాసరాహిత్య తీర్మానం తీసుకువచ్చాడు. ఇల్లా కాంగ్రెసువారు పతనం అవడానికి మోతిలాల్‌నెహ్రూగారిదే బాధ్యత అన్నాడు. ఆయన పార్టీ నాయకుడు. పైగా "స్కీన్" కమిటీలోనూ, ఇంపీరియల్ కౌన్సిలులోనూ సభ్యత్వం స్వీకరించడానికి ఒప్పుకున్నారు. గోపాలమేనోన్ తీసుకు వచ్చిన తీర్మానానికి, శ్రీనివాసయ్యంగారు సవరణ ప్రతిపాదించారు. ఒక ఉపసంఘం మదరాసు శాసన సభలోని కాంగ్రెసు పక్ష సభ్యుల కార్యకలాపాల విషయమై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఆ సవరణ. ఏదోరకంగా కాలయాపన చేసి, విశ్వాసరాహిత్య తీర్మా