పుట:Naajeevitayatrat021599mbp.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌహతీ కాంగ్రెస్ విశేషాలు

1926 లో జరిగిన ఎన్నికల వేడి తగ్గకుండానే అస్సాం కాంగ్రెసు ఆరంభం అయింది. ఎన్నికల సంరంభంతో శరీరం పులిసిపోయినా నేను కొందరి మిత్రులతో కలసి గౌహతికి వెళ్ళాను. అస్సాం దేశపు పేరుబడిన లోయలలో ఈ గౌహతి అన్నది ఒక చిన్న గ్రామం.

పులులూ మొదలైన అడవి మృగాలకు ఆటపట్టని చెప్పబడే అడవి ప్రాంతానికి ఆనుకునే, కాంగ్రెసు పెండాలు నిర్మించబడింది. ఆ ప్రాంతం పులులకే గాక అడవి యేనుగులకు కూడా ఆటపట్టనీ, అవి తరుచుగా వచ్చి ఆ చుట్టుపట్ల వారికి తీరని నష్టాలు కలుగజేస్తూండం పరిపాటనీ తెలియ వచ్చింది. ఆ పెండాలు నిర్మాణానంతరం, అనుదినమూ వాటిలో భీతి కలిగించి వాటిని దూరంగా పారద్రోలాలనే ఉద్దేశంతో ప్రతీ రాత్రి, ప్రతీ ఉదయమూ డప్పులూ, దండోరాలూ వాయించేవారు.

ఆ ప్రాంతం ఎంతో ప్రఖ్యాతి వహించిన హిమాలయాలపాదాల దగ్గర ఉండడాన్ని చాలా మనోహరంగా ఉంది. ఎక్కడో దక్షిణా పథం నుంచి వచ్చిన అ కాంగ్రెసు అధ్యక్షుణ్ణి 52 ఏనుగులు లాగే బండిమీద ఎంతో ఘనంగా ఊరేగిస్తారనీ, ఆ ఊరేగింపులో పాల్గొంటూ ఆనంద పారవశ్యంలో ఓలలాడాలనీ ఉవ్విళ్ళూరాం.

ఆ తరుణంలో అక్కడ డిల్లీలో శ్రద్ధానందుని కాల్చి చంపుతారని మేమెవ్వరమూ కలలో కూడా ఊహించలేదు. దాన్తో కాంగ్రెసంతా అంధకార బంధురమైన దు:ఖ సముద్రంలో మునిగిపోయింది. అధ్యక్షుని ఊరేగింపూ ఆగిపోయింది. హృదయాలు బరువెక్కినా ఆ కార్యక్రమ మంతా నిశ్చల దీక్షతో, సంకల్పించిన ప్రకారం నడుపబడింది.

ఆప్తమిత్రుడు శ్రద్దానంద

శ్రద్దానందస్వామిది చాలా నిండయిన గంభీర విగ్రహం, నిష్కపట సరళ హృదయుడు. ధైర్య స్థైర్యాలు గల వ్యక్తి. అంతేకాదు దేశంకోసం ఏ క్షణాన్నయినా ప్రాణాలు సమర్పించడానికి వెనుదీయని