పుట:Naajeevitayatrat021599mbp.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తి. సుప్రసిద్ధ దేశభక్తుడు. నాకు ఆప్తమిత్రుడు. మేము సన్నిహితులం. ఎప్పుడు కలుసుకున్నా హృదయాలను విప్పి మాట్లాడుకునే వాళ్ళం. హిందూ మహమ్మదీయ సఖ్యం విషయంలోనూ అభిప్రాయాలు ఒకరి కొకరం చెప్పుకునేవారం. కాంగ్రెస్సులలోనూ హిందూ మహాసభా కాన్ఫరెన్సులలోనూ తరచు కలుసుకునే వారం.

1922లో జరిగిన ముల్తాన్ గొడవల్ని పురస్కరించుకుని మదనమోహన మాలవ్యాగారు లజపతిరాయిగారూ, స్వామీ శ్రద్ధానంద కలసి స్థాపించిన హిందూ మహాసభ దిన దిన ప్రవర్థమానమై, క్రమేపి దేశంలో ప్రముఖ స్థానాన్నే ఆక్రమించింది. కలకత్తాలో హిందూ-మహమ్మదీయ కలహాలు జరిగిన దరిమిలా మేము ఉభయలమూ ఒక ఉపన్యాస వేదికపై అనుకోకుండా కలుసుకున్నాము. ఈ హిందూ మహమ్మదీయ సంక్షోభాన్ని గురించి తర్కించాం.

ఆయన బెంగాలులో ఉన్న హిందువుల మహమ్మదీయుల జనాభా లెక్కలతో సమన్వయం చేస్తూ బెంగాలు చరిత్రంతా నాకు తెలియజేశాడు. ఏ పుస్తకమూ తిరగవేయవలసిన అవసరం లేకుండానే కావలసిన సమాచారమంతా ఆయన నాలిక చివరే ఉండేది. ఆధిలో అత్యధికమైన హిందూ జనాభా కలిగిఉండే ఆ బెంగాలు రాష్ట్రంలో మహమ్మదీయ ప్రాబల్యం వృద్ధి అయిన కొద్దీ, ఏటేటా ఎల్లా హిందువులు మహమ్మదీయ మతాన్ని స్వీకరించిందీ, ఇప్పుడు ఏ ప్రకారంగా ఆ హిందూ జనాభా అంతా క్షీణించిన అల్పసంఖ్యాకి వర్గంగా రూపొదిందీ వివరిస్తూంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆయన గత 70, 75 సంవత్సరాలలోనూ జరిగిన యీ మతాల మార్పిడుల చరిత్ర సమగ్రంగా వివరించి చెప్పాడు.

స్వామీ శ్రద్ధానంద తాను ఆర్యసమాజ సంఘ సభ్యుడననీ, తాను తన అనుచరులూ కలసి హిందూ సంఘ సముద్ధరణకోసం ఎల్లా పాట్లు పడుతున్నదీ వివరించాడు. మహమ్మదీయుల బారీ నుంచి హిందువులు తప్పించుకునే శక్తి కూడా లేక, ఆత్మరక్షణకూడా సరిగా చేసుకోలేని స్థితిలో ఉన్నారనీ, ఇస్లాంనుంచి, తిరిగీ హిందూమతంలోకి మారా