పుట:Naajeevitayatrat021599mbp.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోగడ నేను మొదటి రెండు కొట్లాటలకూ ప్రధానమయిన కారణాలను వివరించే ఉన్నాను. నేను కార్యనిర్వాహక సంఘ సభ్యుడ నయ్యుండీ కూడా, మంజూరయిన ధానాన్ని ఏ కారణాలవల్ల ఆత్మార్పాణ జేసిన ఆ బాధితులకు అందచేయలేకపోయానో కూడా వివరించే ఉన్నాను. ఏటేటా ప్రో ఛేంజ్-నో ఛేంజ్ తెగల మధ్య రగులుతున్న మంటలు రాజుకుంటూనే ఉన్నాయనీ చెప్పే ఉన్నాను. ఈ నోఛేంజ్, ప్రో ఛేంజ్ పార్టీలతో విసిగిపోయిన డాక్టర్ అన్సారీ, సరోజనీదేవీ, నేనూ కొంతమంది ఇతర మిత్రులతో కలసి "సెంటర్‌పార్టీ" అనే మధ్యమ వర్గ సంఘాన్ని స్థాపించాం. మా ఉద్దేశం పై రెండు కక్షల వారినీ సన్నిహితులను జేసి, వారి మధ్య సామరస్యం కుదర్చాలనే. ఈ మధ్యే మార్గపు మనిషిగా నేను ఎక్కడయినా హిందూ మహమ్మదీయ కలహం జరిగిందని తెలసిన తక్షణం ఆ తావుకు వెళ్ళి సంగతి సందర్భాలు విచారించే వాడిని.

కొట్లాటలపై కొట్లాటలు

సొంత జేబులోంచి ఖర్చుపెట్టుకుంటూ ఏటేటా ఈ అల్లర్లు జరిగిన తావులన్నీ సందర్శిస్తూ వచ్చాను. ఇక్కడ 1924-27 సంవత్సరాల మధ్య జరిగిన అల్లర్లులను గురించి ప్రస్తావిస్తాను. 1925 మే మాసంలో కలకత్తాలోను, 1925-27 సంవత్సరాలలో బొంబాయిలోను అల్లర్లు జరిగాయి.

బహుశ: 1927 ఈ సంక్షోభాలకు చాలా చెడ్డ సంవత్సరం అని అనవలసి ఉంటుంది. 1927 ఆగష్టు 29 వ తేదీన లార్డ్ ఇర్విన్ కేంద్ర శాసన సభలో సభ్యుల కందించిన సమాచారాన్నిబట్టి, ఉత్తర ప్రదేశ్, బొంబాయి, పంజాబు, మధ్యప్రదేశ్, బీహారు, బెంగాలు రాష్ట్రాలలోనూ, డిల్లీలోనూ జరిగిన కొట్లాటలు మొత్తం 26 అనీ, అవి ఆగష్టు 25 నాటికి గత 18 మాసాల లోపలనే జరిగినవనీ తెలియవచ్చింది. పంజాబులో రెండు, ఢిల్లీలో రెండు, బెంగాలులో రెండు, ఉత్తర ప్రదేశ్‌లో పది, మధ్యప్రదేశ్ లో రెండు, బీహారులో రెండు, బొంబా