Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవిడ ఇంట్లో నన్ను భోజనానికి కుదిర్చారు. ఈ కాలంలోనే వల్లూరు గ్రామంలో మాకు వున్న భూములుపైని కాటకం చేత పన్నులు చెల్లకపోవడంవల్ల, వెంకటగిరి ఎస్టేటు వారు వాటికి జప్తులు పెట్టి, వేలం పాడించి అమ్మించారు. మా నాయనగారు నాయుడుపేటలో వుండగానే వల్లూరులో మా పెత్తండ్రులు స్థితి కూడా చితికిపోయింది. వల్లూరు కరిణీకం చేస్తూవున్న అప్పాస్వామిగారి అప్పుడే మరణించారు. ఆయన పిల్లలు చిన్నవాళ్ళవడంచేత కరిణీకం ఇంకొక కుటుంబంలోకి సంక్రమించింది. ఆనాడు కరిణీకాలు జమీన్ దారుల కటాక్షం మీదనే ఆధారపడి వుండేవికదా!


2

తండ్రిగారి మరణం

1884 వ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. మా నాయన గారికి అప్పుడప్పుడు శూలనెప్పి వస్సూఉండేది. ఆయన ఆ శూలనెప్పితోనే 1884 సంవత్సరంలో మల్లాంలో స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా జీవించి ఉండగానే నాకు నాయుడుపేటకి కబురు వచ్చింది. కాని, నేను ఊరు చేరుకునే సరికి ఆయన ప్రాణం పోయింది. అప్పటికి మా తమ్ముడు జానకిరామయ్య 3వ మాసం గర్భంలో ఉన్నాడు. శ్రీరాములుకి 8 సంవత్సరాలు. అప్పటికి మా చెల్లెలు అన్నపూర్ణ వయసు సుమారు 4 సంవత్సరాలు. అప్పటికి అప్పగా ర్లిద్దరూ కాపరాలకి వెళ్ళారు. ఈ స్థితిలో కుటుంబభారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకి ఉన్న సాధనాలు కూడా కొరతపడిపోయాయి. పిత్ర్యం ఖర్చయిపోయింది. తండ్రిగారి స్వార్జితంలో నిలవ అనేది శూన్యం. ఈ స్థితిలో మాకు కలిగిన విపత్తునుగురించి తెలియపరచగా మా మేనమామగారు కొంతకాలానికి వచ్చి, మమ్మల్ని ఆదరించి, ఆ