పుట:Naajeevitayatrat021599mbp.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను పడ్డ మథన

చెన్నపట్నంనుంచి వారి పేర సుదీర్ఘమైన లేఖ వ్రాస్తూ అందులో, పెద్ద యెత్తున నడుస్తూన్న ఒక సంస్థను అకస్మాత్తుగా మూయడంలో ఉండే కష్టనష్టాలను గురించి సూచించాను. ఏ విధంగా, ఎన్ని తంటాలుపడి, యీ దేశీయుల నుంచే గాక, విదేశీయుల నుంచి కూడా ధనం ఎల్లా సేకరించబడిందో వివరించాను. అంతేగాక, ఆరోజు వరకూ ఆయన ఆరంభించిన కాంగ్రెసు ఉధ్యమం చెన్నరాష్ట్రంలో బాగా నాటుకు పోవడానికి నా పత్రిక ఎల్లా ఉపకరించిందో కూడా వివరించాను.

అది ఒక "ట్రస్టు ప్రాపర్టీ"లాంటిదనీ, దానినే గనుక యిప్పట్లో మూసువేస్తే, తన చర స్థిర ఆస్తుల నన్నింటిని జాగ్రత్తగా కాపాడు కుంటూ, స్వలాభం కోసం ఈ సంస్థను మూసేశాడనే చెడ్డ పేరు కూడా నాకు వస్తుందని తెలియబరిచాను. నన్ను బాగా బాధపెట్టిన విషయం నిజంగా అదే. ఆ ప్రజాభిప్రాయమే. అదాటుగా పత్రికను ఆపుచేస్తే ప్రజలలో నా కీర్తి ప్రతిష్టలు ఎల్లా ధగ్నమయి పోతాయోననే చింతే నన్ను బాధించింది. ప్రాక్టీసు విరమించడమూ, ప్రపంచ చరిత్రకే వినూత్నమయిన విధంగా ఈ దేశంలో ప్రజా రాజ్యం సంపాదించాలనే వాంఛతో కాంగ్రెసులో చేరి నేను చేసిన సేవా, అన్ని యీ పత్రిక మూసివేసిన కారణంగా మట్టమవుతాయనే బాధే నన్ను బాగా పీడించ సాగింది.

అ నాటి సంకల్పం

ప్రజాక్షేమంకోసం దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభింపబడిన వార పత్రికను మూసివేయడం విషయంలో సరిగా ఇటువంటి ఆలోచనలే వచ్చి, గాంధీగారిని చికాకు పరిచాయి. ఆనాడు ప్రాక్టీసు విరమించి నేను ఉద్యమంలో దిగినప్పుడు, నా జీవితంలో వెనక్కి అడుగు వేయకూడదన్నదే, నాసర్వస్వం, నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ సమూలంగా నాశనం అయినా, చేపట్టిన దేశసేవ విరమించరాదన్నదే