పుట:Naajeevitayatrat021599mbp.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా సంకల్పం. నేను సంపాదించినదంతా ప్రజల డబ్బే. అ ప్రజల కొరకే అ ధనాన్ని వ్యయపరచ గలగడం అన్నది ఒక ఘన కార్యమే ననే ఊహా నన్ను బాగా ఊపింది. అవసరాలనుబట్టి, అనుకున్న విధంగా, ప్రజాసేవలోనే ఉన్నదంతా వ్యయపరచ గలిగాననే సంతుష్టి నాకుంది.

ఉద్యమంలో చేరే రోజున, సత్యాహింసల పునాదితో ప్రారంభింపబడిన సహకార నిరాకరణ ఉద్యమాన్ని గురించి గాంధీగారు చెప్పినప్పుడు, అ ఉద్యమంలో ఉండే సావకాశాలూ, దాని విస్తీర్ణాది ఘన పరిణామాలూ నాకు నిజంగా తెలియవు. అప్పటికి నేను భగద్గీతగాని, హైందవ వేదాంతాది గ్రంథాలుగాని చదివి ఉండలేదు. ఆ ఉపనిషత్తులూ, భగవద్గీతా మున్నగునవి చదివి ఉండి ఉంటే, మన మతమునకూ, సాంఘిక జీవనానికీ ఉన్న లంకె, పుట్టిన ప్రతి వ్యక్తీ తన పొట్టనింపుకోవడానికి మాత్రమే పుట్టలేదనీ, సంఘసేవా, మానవసేవా, దేశసేవా అన్నవి ప్రతి వ్యక్తీ అవలంబింపవలసిన విధులనీ గ్రహించగలిగి ఉండేవాణ్ణి

గాంధీగారు ఈ కాంగ్రెసు ఉద్యమ స్థాపన, కేవలమూ ఆర్థిక రాజకీయ స్వాతంత్య్ర సంపాదన కోసమే కాదనీ, మతానికి బానిసలమై, మరచిన మానవత్వం ఉద్ధరింపబడాలన్నది కూడా గాంధీగారి ముఖ్య సూత్రమేననీ అర్థముయి ఉండేది. భగవద్గీతలోనూ, పురాణ ఇతిహాసాది ఉత్తమ మత గ్రంథాలలోనూ, అంతర్గతంగానూ, సూత్రప్రాయంగానూ నిర్దేశింపబడిన కర్తవ్యాదులూ, అనాసక్తాది యోగాలూ గ్రహించ గలిగిన రాజాధి రాజులు కూడా, ఎలా మానవ సేవ, దేశ సేవ, సంఘ సేవా చేస్తూ, సత్యాహింసల కోసం ప్రాకులాడుతూ, తమ యావత్తు ధన, కనక, వస్తు, వాహనాదులనే గాక, ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి కీర్తి గాంచారో అర్థమయి ఉండేది.

గాంధీగారి సూత్రాల ప్రకారం నడుపబడిన కాంగ్రెసు ఉద్యమం కారణంగా మన ఉత్తమ గ్రంథాల ఆశయాలన్నీ ఈ 20 ఏళ్ళ కాంగ్రెసు