పుట:Naajeevitayatrat021599mbp.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బడుతుందని వారు బావించారు.

వీరు వేసిన పదకానికి శ్రీనివాసయ్యంగారు కొద్ది మార్పులను సూచించారు. లోగడ ఐర్లెండులో ఐరిషు రిపబ్లికన్ పార్టీవారు అవలంబించిన విధంగా కౌన్సిల్‌లో ప్రవేశించి, దాని కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉంటే ప్రభుత్వ విధానాలు స్తంభిస్తాయన్నారు. కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశం ఈ విషయాలన్నీ రాబోవు గయా కాంగ్రెసు నిర్ణయానికి వదిలెయ్యడానికి నిశ్చయించారు.

1923 లో కార్యనిర్వాహక వర్గ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చే వరకూ నేను రాజగోపాలాచారిగారితో బాటుగా "నో-చేంజరు" గానే ఉండేవాడిని. 1922 లో జరిగిన ముఖ్య కార్యక్రమం యేమిటని యీనాడు విలియా వేసుకుంటే, కాంగ్రెసులోని ఉభయపక్షాల వారమూ (నోచేంజ్, ప్రోచేంజ్) మా మా పక్షాలకు బలం చేకూర్చుకోవడానికి జరిపిన ప్రచారమేనని ఒప్పుకోక తప్పదు.

దాస్-మోతిలాల్‌గార్లకు తమ విధానంపట్ల ప్రజలలో ఆచరణ అధికమవుతుందనే విశ్వాసం ఉంది. ఎందుకంటే-తమవిధాన ప్రకారం, చేయవలసిన త్యాగాలు అట్టే ఉండవు గనుక. నేనూ, రాజగోపాలాచారిగారూ మాత్రం వారి పదకానికి అంగీకరించలేక పోయాము. అందువల్ల గయా కాంగ్రెసు నాటికి ఉభయపక్షాలవారమూ రెడీ అంటే రెడీ, డీ అంటే డీ అనేటట్లుగానే ఉన్నాము.

గయా కాంగ్రెసులొ మా విజయం

గయా కాంగ్రెసులో మాకే విజయం లభించింది, దాస్-మోతిలాల్‌గార్ల ప్రతిపాదనలు వీగిపోయాయి. వా రుభయులూ బహిరంగ సమావేశంలోనే ఆగ్రహావేశులయ్యారు. కార్యనిర్వాహక వర్గంనుండి వెంటనే వైదొలగుతామనీ, మొత్తం దేశం అంతా తిరిగి విశేష ప్రచారంజేసి, రాబోవు కాంగ్రెసునాటికి తమ భావలే ప్రజలంతా బల