పుట:Naajeevitayatrat021599mbp.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదియాలి. ఈ ఆరు సంవత్సరాలు నేను బ్రతికి ఉంటాననే నమ్మకం యేమిటి?" అన్నారు. నన్ను తమ పద్ధతికి త్రిప్పుకోవాలని చాలా తంటాలు పడ్డారు. కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో కూడా ఎన్ని విధాలో ప్రయత్నించారు.

గాంధీగారికి శిక్ష విధింపబడడమూ, *దాస్, మోతిలాల్ గారలు కౌన్సిల్ ఎంట్రీకి అనుకూలంగా ప్రచారం ఆరంభం చేయడమూ గమనించిన లేటు ఎస్.శ్రీనివాసయ్యంగారు కాంగ్రెసులో చేరారు. గాంధీగారి సహాయ నిరాకరణ పద్దతి నచ్చక ఆయన అంతవరకూ కాంగ్రెసులో చేరలేదు. అప్పట్లో ఆయన చెన్న రాజధానికి అడ్వకేటు జనరలు. కాగా సి.ఐ.యి. బిరుదు పొందినవారు. ఆయన తన బిరుదును విసర్జించి, పదవికి రాజినామా చేసి, దాస్, మోతిలాల్ ప్రభృతుల కౌన్సిల్ ఎంట్రీ పదకానికి కావలసిన చేయూతనిచ్చి తీరాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసులో చేరాడు.

కాని దాస్, మోతిలాల్ గార్లకు మనస్సులో ఒక చిన్న బెదురు ఉండిపోయింది. సత్యాగ్రహం, సహకార నిరాకరణం అన్న వాటిని ఆరంభమయిన కొద్ది రోజులలోనే విరమించినట్లయితే, దేశంలోనూ, ప్రజలలోనూ తమపట్ల ఏం దురభిప్రాయం యేర్పడుతుందో నన్న భయంతో, సహకార నిరాకరణ అంటూనే తమ పదకాన్ని కొంత మార్పుతోనూ, మెలికతోనూ అమలు జరపాలని తలచారు. ఆ ఇరువురూ మేధావులు, లాయర్లు. అట్టి వారికి పదకాలకూ, మెలికలకూ, మార్గమే దొరకదా? కౌన్సిల్ ప్రవేశ మన్నది మంత్రిపదవుల కోసమూ, వారు ప్రవేశపెడతా మన్న సంస్కరణలు అమలు జరపడానికి కాదు అనీ, మేము లోపల ప్రవేశించి వారి కార్యక్రమాలు స్తంభింప జేస్తామనీ, దాంతో వారి పరిపాలనా విధానాన్ని సాగకుండా చేస్తామనీ చెప్పసాగారు. నిర్బంధానికి ముందు గాంధీగారు వారి పదకానికి ఒప్పుకోలేదు. ఆయన జైలులో ఉన్న కారణాన్ని కాంగ్రెసులో తమ పదకం అంగీకరింప