పుట:Naajeevitayatrat021599mbp.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయత్నానికి ప్రతి ఫలంగా మిలిటరీ కోర్టువారు ఆయన్ని అరెస్టుచేసి, ద్వీపాంతరవాస శిక్ష విధించారు.

హైకోర్టులో నా దగ్గిర జూనియర్‌గా పనిచేసిన శ్రీ కే.సి.కేశవమేనోన్ తన ప్రాణానికి తెగించి యెంతో సేవచేశాడు. అదృష్టవశాత్తూ ఆయన్ని అరెస్టు చేయలేదు. నేను కాలికట్టు చేరిన మూడోనాటికి కేశవమేనోన్ అక్కడికి వచ్చాడు. జరుగుతూన్న సంఘటనలను గురించి ఆయన వ్రాసిన ఒక రిపోర్టు టైపు కాగితాలు నా కిచ్చాడు. నారాయణమేనోన్ అరెస్టయిన కారణంగా ఆయన్ని నేను కలుసుకోలేక పోయాను.

చాలామంది కాంగ్రెసువారు ఒక ప్రక్క మాప్లాల చేతులలోను, ఇంకొక ప్రక్క మిలిటరీవారి చేతులలోనూ ఎన్నో యిక్కట్లకు పాల్పడ్డారు. కాంగ్రెసుతో సంబంధం ఉన్నా లేకపోయినా అనేక హిందూ కుటుంబాలవారు, ఆ విప్లవ ప్రాంతంనుంచి ప్రాణాలకు తెగించి సకుటుంబంగా పలాయనం చిత్తగించారు.

అపూర్వ సంఘటన

ఈ పరిస్థితులలో కొన్ని వింత సంఘటనలు జరిగేవి. ఒక హిందువు మాప్లా వేషంతో ప్రాణాలని కాపాడుకో గలిగాడు. ఆయన ఒక లక్షాదికారి. ఒక మాప్లా గుంపు ఆయన ఇంటిమీద దాడిచేసింది. మాప్లా వేషంలో ఉన్న ఆ అసామి, యజమాను లందరూ పారిపోయారని, తాను ఆ యింటి నౌకర్ననీ, దాడి చెయ్యడానికి వచ్చిన ఆ గుంపుతో విన్నవించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. కాని ఆయన్ని మిలిటరీ కోర్టువారు పట్టుకొని అరెస్టుచేసి మరణ దండన విధించారు. ఆయన మిలిటరీ వారితో తన మాప్లా నామాన్నే చెప్పాడు. ఆయన్ని మాప్లాగానే అరెస్టు చేశారు. మాప్లాగానే విచారించారు. మాప్లాగానే ఆయనకి మరణశిక్ష విధించారు. శిక్ష విధింపబడిన వెంటనే ఆయన ఈ కోర్టులలో న్యాయం జరగడం లేదనీ, తానూ మాప్లా కాదనీ, స్వప్రాణ రక్షాణార్థం మాప్లా వేషం వేసుకోవలసి వచ్చిందని గట్టిగా అరిచాడు. జడ్జీ ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆచార ప్రకారం వెంటనే