పుట:Naajeevitayatrat021599mbp.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమలు జరుపబడే మరణ శిక్షను ఆపుచేశారు. ఆయన నిజంగా హిందువే అనే విషయం తేల్చుకోవడానికి విచారణ ఆరంభించారు. నిజం బయట పడ్డాక తాము విధించిన శిక్షను రద్దుపరచి ఆయన్ని విడుదల చేశారు.

ఇది ఒక అపూర్వ సంఘటనే అయినప్పటికీ, మార్షల్ లా ప్రాంతంలో , ధనానికి, ప్రాణానికీ ఎటువంటి రక్షణ ఉంటుందో, వాటిని కాపాడుకోవడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. అవి భయోత్పాతం స్వైర విహారం చేసిన గడ్డు దినాలు

మూల కారణం

నా విచారణ సందర్బంలో అసలు ఈ విప్లవానికి మూలకారణం ఏమయి ఉంటుందని పరిశీలించాను. డి.యస్.పి. హిచ్‌కాక్‌తో ఏకీభవించిన ప్రభుత్వోద్యోగులంతా ఈ తిరుగుబాటుకు కారణం కాంగ్రెస్ ఖిలాఫత్ సంఘాలవారి చర్యలేనని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. లోగడ ఒట్ట పాలియం సమావేశ సందర్భంలో, హిచ్ కాక్ అవలంబించిన విధానమూ, మా పై ఆయన వేసిన పరువు నష్టం దావా సంగతీ, యాకుబ్ హుస్సేన్ యం. కోయా, మాధవన్‌నాయరు, గోపాలన్ మేనోంగార్ల పై ఆయన విధించిన ఆంక్ష, ఆ 144 వ సెక్షను ఉల్లంఘించిన కారణంగా వారికి విధింపబడిన శిక్షా మున్నగు అంశాలన్ని లోగడ వివరించే ఉన్నాను.

ఇటువంటి పరిస్థితులలో ఆంగ్లేయాధికార్లు, కాంగ్రెస్, ఖిలాఫత్ సంఘాలవారి కార్యక్రమాల కారణంగానే ఈ మాప్లా సంరంభం ఆరంభం అయిందని నమ్మడంలో ఆశ్చర్యం ఏమీలేదు. 1922లో జరిగిన ముల్తాన్ విప్లవ సందర్భంలోనూ, ఇప్పుడూ కూడా సత్యానికీ, అధికార్లచే ప్రచారం చేయబడ్డ కారణాలకూ ఎక్కడా సంబంధం లేదు.

నా విచారణలో రికార్డయిన అంశాలనుబట్టి, హిందూ జమీందార్లకూ, మాప్లా రైతాంగానికి మధ్య కొన్ని తగాయిదాలు ఉత్పన్నం అయ్యాయన్న సంగతి తేలింది. మాప్లాల జీవనోపాది పొలాలమీదనే ఆధారపడి ఉంది. వారు రహితులుగానూ, పాలేర్లగానూ, బ్రతికేవారు. అప్పట్లో నేను సేకరించిన సమాచారాన్నిబట్టి తేలిన అంశం ఏమిటంటే,