పుట:Naajeevitayatrat021599mbp.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాట! ప్రఖ్యాత హిందూ కాంగ్రెసు నాయకులవద్దా, గ్రామంలోని ఇతర పెద్దలవద్దా నేను స్వయంగా సేకరించిన సాక్ష్యంలో, మహమ్మదీయ స్వచ్చంద సేవక దళాలు పనిచేస్తూన్న తీరును గురించి విపులంగా సమాచారాన్ని సేకరించాను. కత్తిసామూ, కర్రసామూలాంటి హింసాత్మక పద్ధతులలో మహమ్మదీయ వాలంటీర్లకు శిక్షణ గరపబడుతోందనీ, పైకి కాంగ్రెసు శాంతి దళ చిహ్నాన్ని ధరించినా, అంతరంగికంగా హింసాత్మక విధానాలలో తర్ఫీదు పొందుతున్నారనీ తెలిసింది.

1941-42 సంవత్సరాలలో జిన్నాగారూ, ముస్లింలీగు వారూ కనబరచిన వింత ధోరణి అర్థం చేసుకోవాలంటె, మనం వెనుకటి చరిత్ర పుటలు తిరుగవేసి, లక్నో పాక్ట్ దగ్గరనుంచీ జరిగిన సంఘటల నన్నింటినీ నెమరు వేసుకోవాలి. ఈ రోజులలో నా జీవితమంతా నేను కాంగ్రెసు సేవలోనే వినియోగించాను. అందువలననే వారికీ మనకీ ఉన్న అభిప్రాయ బేదాలు ఎల్లా దూరతీరాలకు జేరుకున్నాయో, ఏ విధంగా వారికి మనకీ మధ్య ఉన్న ప్రవాహం విస్తరించిందో, త్రోసి రాజే అయినా ఆటకట్టని విధంగా పరిస్థితులు మార్పుచెంది బిగుసుకు పోయాయో అర్థం అవుతుంది. ఇట్టి క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం అవడానికి తోడుపడిన మూలకారణాలూ, పేరుకొని బైటపడ్డానికి వాడబడ్డ చికిత్సా విధానమూ ముందు తరాల వారికయినా సరిగా అవగాహన కావడానికి గాను, జరిగిన చారిత్రక సంఘటనలు వివరంగా వివరింపబడాలి గదా!

భావి భద్రతకోసమూ, దేశ సౌభాగ్యంకోసమూ, అవలంబింప తగ్గ రాజ్యాంగ విధానం విషయమై అనుసరించవలసిన పద్ధతులను గురించీ ఆఖరుసారిగా అ కాంగ్రెసు అధినేతలను అడిగే యత్నంలో అ నాడు నేనున్నాను. మత సామరస్యం కొరవడిన కారణంగా ఉత్పన్న మయిన పరిస్థితులను గురించి విపులీకరించిన సందర్భంలో ఈ నా తుది నిర్ణయాన్ని గురించి విశద పరచాను.

ఎక్కడ యే ప్రాంతంలో సాంఘిక సంఘర్షణ జరిగినా, వెనువెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి, దర్యాప్తు సాగించి, అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడమన్నది కేవలం కాంగ్రెసు కార్య