కాళ్ళవడాన్ని, వారి పట్టు భల్లూకపు పట్టయిపోయింది. ఆ సంగతి పూర్తిగా నిర్దారణయ్యేనాటికి షహజాన్ పూఠ్ సంఘటనకూడా జరిగేపోయింది.
వెంటనే నేను స్వయంగా బయల్దేరి వెళ్ళి అక్కడ జరిగిన ఉదంతాన్ని గురించి వివరాలు సేకరించాను. ఇదీ ముల్తాన్ సంఘటనంత ఉద్దృతమయినదే, ముల్తాన్-షహజాన్‌పూర్ సంఘటనల మధ్యకాలం పండ్రెండు మాసాలున్నా, మా కాంగ్రెసు పెద్దలూ నాయకులూ ఏ విధంగానూ కలుగ జేసుకోకుండా చూపిన అలసత కారణంగానే షహజాన్‌పూర్ సంఘటన జరిగిందని అ ప్రాంతంలో వుంటూవున్న కాంగ్రెసువారేగాక, ఏ పార్టీకి చెందని పెద్దలుకూడా అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆ పండ్రెండు మాసాలలోనూ, హిందూ-మహమ్మదీయ స్పర్ధల విషయంలో కాంగ్రెసువారు పట్టించుకోని కారణంగా, లక్నోపాక్ట్‌లో మహమ్మదీయులకు తీరని అన్యాయమే జరిగిపోయిందనే ప్రచారం బాగా బలపడిపోయి, ఆ లక్నో ప్యాక్ట్‌ను తిరగదోసి ముస్లింలకు ఇంకా ఇతోధికంగా ఉపకరించే విధానంగా ఆ పాక్ట్‌ను మార్చాలనే నినాదం బలాన్ని చేకూర్చుకుంది. అంతేకాదు. వృత్తి వ్యాపారాలన్నీ హిందువుల చేతులలో ఉండడాన్నే, మహమ్మదీయులలో బీదరికం తాండవ మాడుతోందనే ప్రచారం సాగింది. నా విచారణ సారాంశంగా షహజాన్‌పూర్ సంఘటన ఆర్దికమైన ఇబ్బందులవల్లా, అధికధరలవల్లా జరిగిందని రుజువయింది. ఈ అర్ధికపు టిబ్బందులకూ, ధరల పెరుగుదలకూ మూలకారణం హిందూ వ్యాపారస్థులదేనన్న నినాదం బలపడింది. ఇట్టి విధంగా హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు క్లిష్టపరిస్థితులకు లోనయ్యాయి.
గాంధీగారిని నిర్బంధించేవరకూ అహింసాత్మక విధానాను గుణంగానే వ్యవహరించిన ఖిలాఫత్ వాలంటీర్లూ, మహమ్మదీయ స్వచ్చంద సేవకులూ షహజాన్‌పూరు సంఘటన నాటికి నూతన పంధా త్రొక్కి, క్రొత్త తీరున వ్యవహరించడానికి నిశ్చయించుకున్నారన్న