Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంటూ దాసుగారి స్వదస్తూరీతో వ్రాయబడిన నోటు బుక్కుకూడా ఈ సమయంలోనే గాంధీగారికి అందించబడింది. ఎన్నో పేజీలలో స్వయంగా మోతీలాల్ గారే వ్రాసిన నిరసనపు టుత్తరం మోతిలాల్ గారి ప్రయివేటు సెక్రటరీ ఒకాయన జైలునుంచి తీసుకువచ్చి స్వయంగా గాంధీగారికి అందజేశాడు.

సి.ఐ.డి.లు

ఈ అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో చాలమంది ప్రతినిధులు పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న సి.ఐ.డి వారు కూడా చాల మంది వచ్చారు. మీటింగులో సి.ఐ.డీ. లున్నారన్న వార్త ఒక చిన్న హెచ్చరిక రూపంగా గాంధీగారికి అందజేయబడింది. గాంధీగారి తత్వంలో భీతి, భయం, రహస్యం అన్నవి ఎప్పుడూ లేక పోవడంచేత సభలో ఉన్న సి.ఐ.డీ. లను వేటాడి తరిమి వేయడమన్నది జరుగలేదు. తమకు జేరిన హెచ్చరికకు గాంధీగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఈ సభలో ప్రతినిధులు కాని వారు ఎవరయినా ఉంటే వారు మర్యాదగా తప్పుకోవడం న్యాయమనే సూచనను మాత్రం జేసి ఆయన తన పనిలో తాను నిమగ్నుడయ్యాడు. సంగతి సందర్భాలన్నీ ప్రతినిధులకు బాగా ఆకళింపు అవడానికి గాను దాస్, మోతిలాల్ గారలు వ్రాసిన ఉత్తరాలు సభలో ఆమూలాగ్రంగా చదువబడ్డాయి. సభలో గాంధీగారి భావాలకు వ్యతిరేక అభిప్రాయాలుగల వ్యక్తులు కొందరున్నారనీ, అట్టివారు గాంధీగారి సన్నిహిత అనుచరులలోనే ఉన్నారనీ సభికుల కందరికీ సువ్యక్తం అయింది.

కంటనీరు తెప్పించిన వాజ్మూలం

గాంధీగారి ఒంటిమీద చెయ్యివేస్తే యేమవుతుందోనన్న భీతితో పరిస్థితులను గమనిస్తూ అవకాశం కొరకు వేచివున్న ప్రభుత్వం వారు ఈ సమావేశం అనంతరం గాంధీగారిని నిర్భయంగా నిర్భంధింపగలిగారు. కార్యనిర్వాహకవర్గ సభ్యునిగానూ, సహాయ కార్యదర్శిగానూ కూడా నేను యీ సమావేశాలన్నింటిలోను మొదటి నుంచీ పాల్గొంటూనే