పుట:Naajeevitayatrat021599mbp.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


3

గాంధీగారి విచారణ, నిర్బంధం

అహమ్మదాబాదు కాంగ్రెసు అనంతరం ఢిల్లీలో డాక్టర్ అన్సారీ గారి ఇంటిలో అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం జరిగినప్పుడు సి.ఆర్. దాస్‌గారికి అందజేయబడిన "రాజీ" ప్రతి పాదనలు చర్చించబడ్డాయి. ఆ రాజీ ప్రతి పాదనలలో లార్డ్, క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ చట్టం క్రింద నిర్బంధింపబడిన వారి నందరినీ విడుదల చేస్తామనీ, లండన్‌లో జరుపదలచిన రౌండ్ టేబిల్ కాన్పరెన్స్‌లో భారత దేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion status)యిచ్చే విషయాన్ని గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ రీడింగ్ ప్రభువు తెలియజేశాడు. దాస్‌గారూ, మోతిలాల్ నెహ్రూగారూ కూడా ఈ ప్రతిపాదనలకు సుముఖంగానే ఉన్నారు. కానీ కరాచీ ఖైదీలనూ, ఫత్వా ఖైదీలనూ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం వారు అంగీకరింపకపోతే, కొన్ని క్లిష్ట పరిస్థితులకు కాంగ్రెసు లోనవుతుందని మహాత్మా గాంధీగారు సూచించారు. ఈ సూచన చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూగార్లను ఆగ్రహా వేశుల్ని చేసింది.

నాయకులలో అభిప్రాయ భేదాలు

ఈ సమయంలోనే హింసాత్మకమైన "చౌరీ చౌరా" సంఘటన జరిగింది. దాన్తో గాంధీగారు తమ సత్యాగ్రహ కార్యక్రమాన్ని హఠాత్తుగా ఆపివేశారు. ఇది జరిగిన అనతికాలంలోనే తిరిగి డిల్లీలో డా|| అన్సారీగారి గృహంలోనే అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం జరిగింది. దేశంలో ఎక్కడో మారుమూల జరిగిన యేదో సంఘటనను సాకుగా తీసుకొని గాంధీగారు తమ ఉద్యమాన్ని విరమించడం శుద్ద తప్పని వివరిస్తూ కొన్ని ఠావుల సుదీర్ఘ నిరసన లేఖను దాసుగారు వ్రాశారు. ఈ టైపు చేయబడిన ఉత్తరాన్ని దాసుగారి అల్లుళ్లలో ఒకరయిన "రాయ్"గారు స్వయంగా తీసుకువచ్చి గాంధీగారికి అందజేశారు. ఉద్యమ విరమణ విషయంలో గాంధీగారు గొప్ప తప్పిదాన్నే చేశా