పుట:Naajeevitayatrat021599mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఫ్ అసోసియేషన్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మొదలైనవి తయారుచేయించి, స్థాపించబోయే పత్రికలు, ప్రత్యేకంగా కాంగ్రెసు కార్యక్రమాన్నీ, కాంగ్రెసు ఆశయాల్నీ అవలంబించి నడిపించడానికే ఉద్దేశింపబడ్డాయి అని వ్రాశాము.

ఆ రోజుల్లో ప్రజలకీ, నాయకుల్లో ముఖ్యులకీ కూడా కాంగ్రెసు ఆశయాలు, కాంగ్రెసు కార్యక్రమమూ కూడా బాగా తెలియడానికి అవకాశాలు ఉండేవికావు. త్రివిధ బహిష్కరణాల్ని గురించి అర్ధం అయింది కాని, తరవాత రాబోయే శాసనోల్లంఘనమూ, అది అవలంబించడంవల్ల వచ్చే కష్టాలూ అవీ క్రమంగా గాంధీగారు, కాంగ్రెస్సూ వెల్లడిచేసి కార్యక్రమం నడిపించేవరకూ కూడా బోధపడలేదు. అందుచేత దేశంలోను, నగరంలోను, గ్రామాల్లోను ఉండే నాయకులు, ధనవంతులు అంతా కూడా ఈ ఉద్యమం జయప్రదంగా జరపడానికీ, తగినంత సాహాయం చెయ్యడానికీ కూడా పత్రిక అవసరం అని నిర్ణయించాము.

27

పత్రికకు నామకరణం

ఈ పత్రికకి 'స్వరాజ్య' అని పేరు పెట్టినవారు సి. రాజగోపాలాచారిగారే. 'స్వరాజ్యము' అని నేను చెబితే చివరి 'ము' తీసివేసి 'స్వరాజ్య' అని ఉండాలని చెప్పినవారు కూడా వారే. రాజగోపాలాచారిగారు ప్రథమంలో ఎక్కువ ఉత్సాహంతోనూ, స్నేహభావంతోనూ ఈ ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంతేకాక ఒకప్పుడు డాక్టరు