పుట:Naajeevitayatrat021599mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvi

తెలుగు జాతి ఆశయాదర్శములకు రూపు కట్టిన ఉజ్జ్వలమూర్తి, తెలుగు జాతియతకు ప్రతీక, ఆంధ్ర ప్రదేశ నిర్మాత, నవీనాంధ్ర పిత - ప్రకాశము పంతులుగారు. యావదాంధ్ర దేశముతో, అందలి మూల మూలల గ్రామములతో, గూడెములతో, ముఖ్యముగ అందలి బహు వర్గముల ప్రజలతో అంత విస్తృత పరిచయముగల నాయకుడు బహుశ: మరొకడు లేడు. దారిద్ర్యమును, అవిద్యను, మూఢ విశ్వాసములను రూపుమాపవలెనను ఆయన ఆశయ సిద్ధికి దీక్షతో కృషిసేయు సజీవాంధ్ర స్త్రీ పురుష ప్రజానీకమే ఆ మహానాయకునికి ఉత్తమ స్మారక చిహ్నము. అన్యస్మారక చిహ్నమేదియు ఆయనకు అంత సంతృప్తి కల్గింపజాలదు.

హైదారాబాదు,
12-6-72.
(సం.) పి. వి. నరసింహారావు