పుట:Naa Kalam - Naa Galam.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మారి న్యాయవాది శ్రీ రామ్‌ జెత్మలాని అన్నట్టు, ఒక పత్రికలో వార్త వచ్చింది!

నేను వెంటనే శ్రీ చరణ్‌సింగ్‌కు లేఖరాస్తూ శ్రీ జగ్‌జీవన్‌ను అలా అనడాన్ని ఖండించాను. ప్రధాని చరణ్‌సింగ్‌ నాకు జవాబు రాస్తూ తాను అలా ఎప్పుడూ అనలేదని, అనబోనని, తాను యు.పి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దళితులకు మంత్రివర్గంలో వారికి లభించవలసిన స్థానాల కంటె ఎక్కువే యిచ్చానని పేర్కొన్నారు.

అంతేకాక, నా లేఖను గురించి, తన జవాబును గురించి ఆకాశ వాణి స్వదేశ, విదేశ వార్తలలో కూడా ప్రచారం చేయించారు!

ఇందిరాగాంధితో ఇంటర్‌వ్యూ

Naa Kalam - Naa Galam Page 76 Image 0001

నెహ్రూ - గాంధి కుటుంబ సభ్యులతో నాకు మానసిక సాన్నిహిత్యం హెచ్చు. నేను 1946లో పునర్జన్మ ఎత్తి నప్పటి నుంచి జాతీయ వాదిగా పాత్రికేయ కలం చేపట్టాను. అందువల్ల, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర