పుట:Naa Kalam - Naa Galam.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తరువాత మాట్లాడిన ఎన్‌.టి.ఆర్‌. "తుర్లపాటి గారి మాటలు విన్న తరువాత మాట్లాడాలంటే, నాకు బిడియంగా వుంది. ఆయన మాట్లాడిన తరువాత మాట్లాడాలంటే కష్టం" అన్నారు. ఆ తరువాత ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మరి రెండు సభలకు నేనే అధ్యక్షుణ్ణి. ప్రతి సభలోను ఆయన నాతో "కుటుంబరావు గారూ! ఏదీ? నెల్లూరు సభలో చెప్పిన డైలాగ్‌ చెప్పండి" అని సభా ముఖంగా తిరిగి "నెల్లూరు సీను" లాంటి సీను సృష్టించుకునేవారు!

జగ్‌ జీవన్‌ రామ్‌ పై చరణ్‌సింగ్‌ చులకన

1979లో శ్రీ చరణ్‌సింగ్‌ భారతదేశానికి తాత్కాలిక ప్రధానిగా వున్నారు. ఆయన 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 13 వరకు ఆ పదవిలో వున్నారు. 1979 ఆగస్టు 20వ తేదీన ఆయన లోక్‌సభలో తన ప్రభుత్వం పట్ల సభ విశ్వాసాన్ని కోరవలసివుంది. అయితే, లోక్‌సభలో తనకు విశ్వాసం లేదని ఆ ఉదయమే తేలిపోవడంతో ఆయన విశ్వాస ప్రకటన కోరకుండానే లోక్‌సభనే రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరారు! రాష్ట్రాలలోవలె కేంద్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు. అప్పటికి వున్న కేంద్ర మంత్రివర్గమే లోక్‌ సభకు కొత్తగా ఎన్నికలు జరిగే వరకు "ఆపద్ధర్మ ప్రభుత్వం"గా వ్యవహరిస్తుంది.

అందువల్ల, పార్లమెంటు ముఖం ఒక్కసారైనా చూడని ప్రధానిగా శ్రీ చరణ్‌ సింగ్‌ కొనసాగుతున్నారు. అప్పటిలో ఒక విశేషం జరిగింది. అంతకు పూర్వం 1979 జూలైలో శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పతనమైన తరువాత ప్రధాని పదవికి చరణ్‌సింగ్‌, జగ్‌జీవన్‌రామ్‌ల మధ్య పోటీ వచ్చింది. చివరకు చరణ్‌సింగ్‌కే ప్రధాని పదవి దక్కింది. అప్పటిలో చరణ్‌సింగ్‌ "చమర్‌ దేశ్‌కే ప్రధాన్‌ కైసే బనేగా?" ("పాదరక్షలు కుట్టుకునేవాడు దేశ ప్రధాని ఎలా అవుతాడు?") అని, శ్రీ జగ్‌జీవన్‌రామ్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించినట్టు తంటాల