పుట:Naa Kalam - Naa Galam.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ కథ భారత స్వాతంత్య్రానికి పూర్వం - 20వ శతాబ్ది ఆరంభంలో ప్రారంభమై, 21వ శతాబ్దిలో కూడా "నడుస్తున్న కథ" కావడం విశేషం. అది భగవత్కృప. అందువల్ల, ఈ ఆరున్నర దశాబ్దాల చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి, అవి కొందరికైనా ఆసక్తి కలిగించవచ్చు. వాటి నుంచి నావలెనే కొందరైనా గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మానవ మనస్తత్వాలను గురించి తెలుసుకోవచ్చు.

ఈ "ఆత్మకథనం" వెలుగు చూడ్డనికి నన్ను ప్రోద్బలించిన అగ్రిగోల్డ్‌ అధినేత శ్రీ వి.ఆర్‌. రావు అవ్వాస్‌ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.

నా "ఆత్మకథ" రాయవలసిందిగా చాలాకాలంగా పదే పదే నన్ను ఒత్తిడి చేస్తున్న యువమిత్రుడు శ్రీ గారపాటి అశోక్‌ కుమార్‌కు నా శుభాశీస్సులు.

ఇక చదవండి!