పుట:Naa Kalam - Naa Galam.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శ్రీ తుర్లపాటి ఎంతటి ఉత్తమ జర్నలిస్టో అంతటి మహోపన్యాసకుడు. ఆయన కలం, గళం పోటీపడి, జంట గుర్రాలవలె పరుగిడుతాయి. పోటీలో ఏది గెలుస్తుందో చెప్పడం కష్టం."

- శ్రీ దాశరథి
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఆస్థాన కవి

"ప్రసిద్ధ జీవిత చరిత్రకారులలో ఒకరైన శ్రీ తుర్లపాటి జర్నలిస్టుగా ఉజ్వల జీవితాన్ని సాగిస్తున్నారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల జీవిత చరిత్రలు వ్రాయడమే కాక, మన దేశానికి సంబంధించిన పెక్కు సాంస్కృతిక, సమకాలిక విషయాలపై ఎన్నో వ్యాసాలు వ్రాశారు. తెలుగులో ఆయన అపార రచనలు చేయడమే కాక, మంచి వక్త కూడా. అందువల్లనే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ప్రసిద్ధ వ్యక్తి. ఆయన బహు గ్రంథ రచయిత. పత్రికా రచయిత మాత్రమే కాక రచయిత కూడా."

- శ్రీ జి. మురహరి
లోక్‌ సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌

"పత్రికా రచన ఆయన ప్రథమ వ్యాసంగమైనా వక్తగా, అనువాదకుడుగా కూడా ఆయనది బహుముఖ వ్యక్తిత్వం."

- జనరల్‌ కె.వి. కృష్ణారావు
కాశ్మీర్‌, త్రిపుర, మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్‌

"వక్తగా, రచయితగా శ్రీ కుటుంబరావు నిర్ణీత లక్ష్యాలు గల వ్యక్తి. ఆయన రచనలు శ్రీ వి.వి.గిరి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వారి ప్రశంసలు పొందాయి. నేను రాష్ట్ర సమాచార మంత్రిగా వున్నప్పుడు చలన చిత్ర రంగాభివృద్ధికి అనేక అమూల్యమైన సలహాలు అందించారు."

- శ్రీ పిడతల రంగారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మాజీ మంత్రి