పుట:Naa Kalam - Naa Galam.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫిలిం అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా వున్నప్పుడు శ్రీ తుర్లపాటితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆయన మేధాశక్తి,సక్రమ నిర్ణయ శక్తి, నిష్పాక్షికమైన తీర్పు ఇవ్వగల దక్షత నాకు అప్పుడు తెలిశాయి. కమిటీ నిర్ణయాలలో చిత్రరంగంలో ఆయనకు గల సుదీర్ఘమైన, పరిణతమైన అనుభవం ఎంతో తోడ్పడింది."

- శ్రీ పి. జగన్మోహనరెడ్డి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

"శ్రీ తుర్లపాటి బ్రహ్మాండంగా రాస్తారు; బ్రహ్మాండంగా ఉపన్యసిస్తారు; బ్రహ్మాండంగా ప్రముఖుల ఉపన్యాసాలను అనువదిస్తారు."

- శ్రీ కోన ప్రభాకరరావు
మహారాష్ట్ర గవర్నర్‌

"శ్రీ తుర్లపాటి విజయవాడలో ప్రముఖ ఉపన్యాసకుడుగా ప్రసిద్ధులు. ఒకసారి ఆయన నా ఉపన్యాసాన్ని అభినందిస్తే, నేను కూడా ఉపన్యాసకుణ్ణి కాగలనని నాకు ఆనందం కలిగింది."

- శ్రీ రామోజీరావు "ఈనాడు" చీఫ్‌ ఎడిటర్‌

"తుర్లపాటి లేని సభ, తుర్ఫులేని పేకాట వుండవు."

- శ్రీ మండలి వెంకట కృష్ణారావు
మాజీ విద్యా మంత్రి, అంతర్జాతీయ తెలుగు సంస్థ మాజీ అధ్యక్షులు

"అపారమైన రాజకీయ పరిజ్ఞానంగల ఆధునిక పత్రికా రచయిత, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రముఖులు, సమస్యలను గురించి ఆయనకు బాగా తెలుసు. ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంలో ఆయనతో ఒకసారి 75