పుట:Naa Kalam - Naa Galam.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"సభాధ్యక్ష బాధ్యత నిర్వహణలో ఆయనకు ఆయనే సాటి. ఇంత సమర్ధంగా సభను నిర్వహించగలవారిని నేను చూడలేదు."

- శ్రీ భాట్టం శ్రీరామమూర్తి
ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాల మాజీ మంత్రి

"జీవిత చరిత్రకారులలో నేనే అగ్రగణ్యుణ్ణి అనుకునేవాణ్ణి. కాని, ఈ రంగంలో శ్రీ తుర్లపాటి నన్ను మించి పోయినందుకు ఆయనను చూచి అసూయ పడుతున్నాను."

- "పండిత" గొర్రెపాటి వెంకట సుబ్బయ్య

"నాకు తెలుగు తెలియకపోయినా, నా ఇంగ్లీషు ఉపన్యాసానికి శ్రీ తుర్లపాటి చేసిన తెలుగు అనువాదానికి ప్రజల "రెస్పాన్స్‌" చూస్తుంటే, అసలు ఉపన్యాసం కంటే అనువాదమే బాగున్నదనిపిస్తున్నది".

- శ్రీ బి. శంకరానంద్‌
కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి

"సినిమా తారలకే అసూయ కలిగించే "గ్లామర్‌" వుంది తుర్లపాటి ఉపన్యాసంలో."

- 'పద్మభూషణ్‌' శ్రీ శివాజీ గణేశన్‌

"శ్రీ తుర్లపాటిని నేను ఇంతవరకు ఉత్తమ జర్నలిస్టుగానే ఎరుగుదును. కాని, నేను పాల్గొన్న ఒక సభకు ఆయన అధ్యక్షత వహించం తటస్థించింది. ఆయన మంచి జర్నలిస్టు మాత్రమే కాక, శ్రోతలను ఉర్రూత లూగించగల గొప్ప ఉపన్యాసకుడని కూడా తెలుసుకున్నాను. ఈ రెండు విశిష్టతలు ఒకే వ్యక్తిలో, అందులోను జర్నలిస్టులో వుండడం అరుదు."

- శ్రీ ఎమ్‌. చలపతిరావు
"నేషనల్‌ హెరాల్డ్‌" మాజీ ఎడిటర్‌