పుట:Naa Kalam - Naa Galam.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శ్రీ తుర్లపాటి వ్రాసిన గ్రంథాలను చదువుతుంటే, ఆ గ్రంథాలలోని నాయకులవలెనే ఆయనకూడా చాలా వృద్ధుడని, వారితో సన్నిహిత సంబంధాలు కలవారని అనిపిస్తుంది. కాని, ఆయనను చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది."

- శ్రీ దామోదరం సంజీవయ్య
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

"సభ ఎంత చప్పగా నడుస్తున్నా, శ్రీ తుర్లపాటి మాట్లడ్డానికి లేచే సరికి దానికి నిండుతనం వస్తుంది. ఆయన మాట్లాడిన తరువాత మాట్లాడాలంటే, కొంచెం ఇబ్బంది గానే వుంటుంది. సభ జయప్రదం కావడానికి ఆయన చేసే దోహదం అపారం."

- "నటరత్న" ఎన్‌.టి. రామారావు
మాజీ ముఖ్యమంత్రి

"శ్రీ కుటుంబరావు జర్నలిస్టుగానే కాక, మహోపన్యాసకుడుగాను, మహా రచయితగాను నాకు చాలా కాలంగా తెలుసు. నేను ఉన్నతాభిప్రాయంతో గౌరవించే కొద్ది మందిలో ఆయన ఒకరు. జీవిత చరిత్రకారుడుగా ఆ రంగంలోని వారందరిని ఆయన అధిగమించారు. తెలుగు సాహిత్య రంగానికేకాక, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఆయన అమోఘమైన సేవ చేశారు."

- "నట సామాట్ర్‌" అక్కినేని నాగేశ్వరరావు

"ప్రెస్‌, పిక్చర్‌, ప్లాట్‌ ఫారం - ఈ మూడు తుర్లపాటి చేతిలోని పదునైన ఆయుధాలు. ఆయన ఇంతగా రాణించడానికి ఇవే కారణాలు."

- శ్రీ వందేమాతరం రామచంద్రరావు
అధికార భాషా సంఘం అధ్యక్షులు