పుట:Naa Kalam - Naa Galam.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్ రెడ్డి లేబరేటరీస్‌ మొదలైన కొన్ని సంస్థలు సాధించిన అభివృద్ధి రేట్లను పేర్కొన్నారు.

దీనిపై స్విస్‌ ఆర్థిక మంత్రి తిరిగి మాట్లాడుతూ "ఇలా ఎవరైనా మాట్లాడితే, మా దేశంలో జెయిలుకైనా పంపిస్తారు, లేదా పిచ్చి ఆసుపత్రికైనా పంపిస్తా"రనేసరికి శ్రీ చంద్రబాబు ఆ విదేశ ఆర్థిక మంత్రి తెంపరితనానికి, అసభ్యకరమైన వ్యవహార శైలికి ఖిన్నుడు కావడం తప్ప, మరి మాట్లాలేకపోయారు!

ఈ ఉదంతాన్ని గురించి పత్రికలలో చదివిన నాకు చాలా బాధ కలిగింది. పార్టీ ఏదైనప్పటికీ, శ్రీ చంద్రబాబు నా స్వరాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడో స్విట్జర్లెండ్‌ నుంచి వచ్చిన ఒక మంత్రి నా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించమా? ఒక విదేశీయుడు మరొక దేశానికి వచ్చి, అక్కడ ఒక ప్రముఖుని, విశేషించి, ఒక ముఖ్యమంత్రిని గురించి అలా అవమానకరంగా ఎద్దేవా చేయడమా? ఇది కేవలం ఒక వ్యక్తికి అవమానం కాదు-మొత్తం తెలుగు వారికే అవమానం, దౌత్యమర్యాదకే అపచారం" అని నేను భావించి, ఆ స్విస్‌ ఆర్థిక మంత్రికి తీవ్రంగా ఒక లేఖ రాశాను. "మీరు ఎద్దేవా చేసింది ఒక ముఖ్యమంత్రిని కాదు-ఆయన ప్రాతినిధ్య వహించే మొత్తం రాష్ట్రాన్ని. మీ వ్యాఖ్యలను ఆంధ్ర ప్రదేశ్‌ పౌరులు తీవ్రంగా పరిగణస్తున్నారు. మీరు మీ వ్యాఖ్యలను ఉపహరించుకోండి, లేదా మా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి" అని రాశాను.

ఆ ఆర్థిక మంత్రి ఏ "మూడ్‌"లో ఉండి, హైదరాబాద్‌ సభలో అలా మాట్లాడాడోకాని, నా లేఖ తో ఆయన తన తప్పిదాన్ని తెలుసుకున్నట్టు కనిపించింది. ఆయన నాకు వెంటనే బెర్న్‌ (స్విట్జర్లెండ్‌) నుంచి సమాధానం రాస్తూ "నా వ్యాఖ్యలు మిమ్మల్ని, రాష్ట్ర ప్రజలను బాధ పెట్టినందుకు నేను