పుట:Naa Kalam - Naa Galam.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అభినందిస్తూ ఒక ప్రత్యేక తీర్మానం చేసి, విజయవాడలో నేను నివసించే వీథికి నా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ వీథి నామకరణోత్సవ సభ కూడా పెద్దయెత్తున జరిగింది. అప్పటి రాష్ట్రమంత్రి శ్రీ ఎమ్‌.కె.బేగ్‌, ఉడా చైర్మన్‌ శ్రీ కంచి రామారావు ప్రభృతులు పాల్గొన్నారు. అయితే, ఆ వీథిలో కాని, ఏ వీథిలో కాని నా కొక సొంత ఇల్లు లేక పోవడం విశేషం; నాకు ఆ వీథిలో ఇల్లు లేక పోయినా, ఆ వీథికి నా పేరు పెట్టడం ఇంకా విశేషం!

స్విస్‌ ఆర్థిక మంత్రి : చంద్రబాబునాయుడు ఉపాఖ్యానం

Naa Kalam - Naa Galam Page 101 Image 0002

2000లో స్పిట్జర్లెండ్‌ ఆర్థిక మంత్రి పాస్కల్‌ భారత దేశం వచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర అభివృద్ధి రేటును పదిశాతం పెంచగలమని పేర్కొన్నారు. అది సాధ్యంకాదని స్విస్‌ ఆర్థిక మంత్రి అనగా, సాధ్యమేనని శ్రీచంద్రబాబు నాయుడు పేర్కొంటూ, అందుకు ఉదాహరణగా