Jump to content

పుట:Molla Ramayanam.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్గంబులతో శ్రీరామచంద్రుం డేగినత్రోవం జన్నంత నా రాముడు దూరంబున జనియె దశరథుండును మరలి వచ్చి పుత్ర శొకంబున నాక పురంబునకుం జనియెఁద దనంతరంబ.


ఆ. చనుచు రాఘవుండు స్వర్ణది యొడ్డున గుహుని గాంచి యతనిఁ గుస్తరించి తడయ కోడఁ బెట్టి దాఁటింపు మనవుడు నట్ల చేయఁ దలఁచి యాత్మలోన ||32||

క. "సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణువి య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో" యని సంశయాత్ముఁడై కడిగె గుహుండు రామపద కంజ యుగమ్ము భయమ్ము పెంపునన్. ||33||

భరద్వాజ మునియాదరాతిథ్యము

ఉ. రాజ కులావతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర నా భర ద్వాజ మహా మునీంద్రు పద వారిజముల్ గని మ్రొక్క నాతఁడం భోజ హితాన్వ యాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం బూజ లొనర్చి కంద ఫల మూలములం బరితృప్తుఁ జేసినన్ ||34||

వ. సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి మఱునటి దిన మర్కోదయమ్మున ||35||

వ. మదముతోడఁ దన్ను ముని భరద్వాజుండు భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ జనియె భాతృ దార సహితుఁడై నన్ముని కూటమునకుఁ జిత్రకూటమునకును. ||36||


మ. ఘనుఁడా రాముఁడు చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో