Jump to content

పుట:Molla Ramayanam.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారచతుష్టయమ్ముతో నయోధ్యానగరంబుఁ బ్రవేశించి
సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్నసమయంబున. |122|
శా.పారావారగభీరికిన్ ద్యుతిలసత్పద్మారకిన్ నిత్యవి
స్తారోదాగవిహారికిన్ సుజనరక్షాదక్షాదక్షారికిన్
సారాచారవిచారికిన్ మదిరిపుక్ష్మాపాలసంహారికిన్
వీరా సాటి నృపాలకుల్ దశరథోర్వీనాథజంబారికిన్.|123|
వ.అని కొనియాడఁ దగిననృపాలశేఖరుండు ధర్మమార్గంబు
నొక్కింతయేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె ననుట
విని నారదుని వాల్మీకి మునీశ్వరుం డటమీఁదికథా
విధానం బెట్టి దని యడుఁగుటయు.|124|
క.జలజాక్ష ! భక్తవత్సల !
జలజాసనవునుతపాదజలజాత ! సుధా
జలరాశిభవ్యమందిర !
జలజాకరచారుహంస ! జానకీనాథా. |125|
గద్యము. ఇది శ్రీగౌరీశ్వరవరప్రసాదలబ్ధ గురుజం గమార్చన
వినోద సూరిజనవినుతాచమత్కారా తుకూరి కేనన
సెట్టితనయ మొల్లనామధేయవిరచితం బైన శ్రీరామా
యణమహాకావ్యంబునందు బాలకాండము సర్వము నేకా
శ్వానము.