Jump to content

పుట:Molla Ramayanam.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem> వదలక పట్టు ఘృష్టి ధరణీఫణిచ్ఛపపోత్రి వర్గమున్ బొదవుచు బట్టుఁడీ కరులు భూవరుఁ డీశునిచాపమెక్కిడున్. క.ఉర్వీనందనకై రా మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం బుర్విం బట్టుఁడు దిగ్ధం త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్. |78| వ.అనిచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున. |79| మ. ఇనవంశో ద్భవుఁడైన రాఘవుడు భూమీశాత్మ జుల్ వేడ్క తోఁ, దను వీక్షింప మునీశ్వరుం డలరఁ గోదండంబుచే నందించి, వ్వన మోపెట్టి గుణంబు పట్టి పటుబాహాశక్తితోఁ దీసినన్, దునిఁగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయుచందమునన్. |80| తే.ధనువు దునిమినంత ధరణీశసూనులు శిరములెల్ల నుంచి సిగ్గు పడిరి సీత మేను వెంచె శ్రీరామచంద్రునిఁ బొగడె వపుడు జనకభూవిభుండు. |81| ఇట్లు శ్రీరామచంద్రునిస త్త్వసంపదకు మెచ్చి సంతోషించి జనకమహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని ధశరధే శ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన ధశరధమహారా జునునాశుభ లేఖలంజదివించి సంతోషంబున నానందభాష్పం బులు గ్రమ్ముదేవర మంత్రి ప్రవరుండగుసుమంత్రునింబిలిపించి సుమంత్రా ! యిపుడు మన మందఱమును బయలుదేఱి మిధి లాపట్టణంబునకుం బోయి యట జనకమహారాజునింట మన రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహమహోత్సవము జరుప ---

  • 'జవ్రాతముల్' అని పాఠాంతరము.

<poem>