పుట:Molla Ramayanam.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భామిని రాయి మున్ను కులపావన చూడగఁ జిత్రమయ్యెనీ
నామమెఱుంగు వారలకుసమ్మఁగవచ్చునుభు క్తిముక్తులున్.
వ. అని యక్కాంతారత్నంబు పూర్వవృత్తాంతం బంతయు
నెంతయు సంతసమ్మున నమ్మనుజేంద్రనందనుల కెఱింగింపుచు
మిథిలానగరంబునకుం జనియె నచ్చట.
సీ.ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజకుమారులు తేజ మలరఁ
బాండ్య ఘూర్జర లాట బర్నర మళయాళ
భూపనందనులు విస్పూర్తి మీఱ
గౌళ కేరళ సింధు కాశ కోసల సాళ్వ
ధరణీ పుత్రులు సిరి వెలుంగ
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృపతనూభవులు నెన్నికకు నెక్క
తే.మఱియు నుత్కల కోంకణ మద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పుఛప్పన్న రాజసుతులు
వచ్చి రక్కామినీస్వయంవరమునకును. |65|
ఉ.కొందఱు పల్లకీల మఱికొందఱు తేరుల నందలంబులన్
గొందఱు కొందఱశ్వములఁ గొందఱుమ త్తగజేంద్రసంఘము
న్గొందఱు స్వర్గడోలికల గోరిక నెక్కి నృపాలనందనుల్
సందడి గాగ వచ్చిరి బుజంబు బుజంబును ద్రోవులాడగన్.
వ. అట్టి సమయంబున. |60|
చ.గురుభుజశక్తి గల్గుపదికోట్లజనంబుల బంప వారు నా
హరునిశరాసనంబుగొనియాడుచు బాడుచుగొంచువచ్చిసు