ఉ.అంబరవీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి రక్తమాం
సంబులు గాధినందనునిజన్నముపైఁ గురియంగ నంతలో
నంబరరత్నవంశకలశాంబుధిచంద్రుడు రామచంద్రుఁడు
గ్రంబుగఁ ద్రుంచెఁజండబలగర్వలదమ్ముఁడుఁదానునొక్కటై.
వ.ఇట్లు రామచంద్రుండు సాంద్రవ్రతాసంబు మించ నిం
ద్రాదులఁ ద్రుంచిన నమ్మునుచంద్రుఁడు నిర్వుఘ్నంబుగా
జన్నం బొనర్చి రామసౌమిత్రులం బూజించె నట్టి సమయ
మ్మున. |58|
క. ధరణీసుత యగుసీతకుఁ
బరిణయ మొనరింప జనకపార్ధువుఁ డిల భూ
వరసుతల రండని స్వయం
వర మొగిఁ జాటించె నెల్లవారలు వినఁగన్, |59|
వ.ఇట్లు స్వయంవరమహోత్సవఘోషంబున సంతోషంబునకుఁ
దోడ్కొని చనుచుండు మార్గంబున. |60|
క.ముది తాపసి వెనువెంటను
వదలక చనుదెంచినట్టి వడి రామునిశ్రీ
పదరజము సోఁకి చిత్రం
బొదవఁగఁ గనుబట్టె నెదుట నొకయుపల మటన్. |61|
క.పద నైయొప్పిద మై కడుఁ
గదలుచు బంగారుపూదె కరఁగినరీతిన్
బొదలుచు లావణ్యస్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిరలీలన్. |62|
ఉ. ఆమునివల్లభుండు గొనియాడుచు బాడుచు వేడ్కతోడ శ్రీ
రామునిఁ జూచి యిట్లనియె రామ ! భవత్పదధూళిసోకియీ
పుట:Molla Ramayanam.djvu/24
స్వరూపం
ఈ పుట ఆమోదించబడ్డది