Jump to content

పుట:Molla Ramayanam.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార మొప్పఁగ నఅహాసవికాస మేర్పడ రాఁగనా
క్రూరరాక్షసిఁ జూచి యమ్మునికుంజరుం డొగి రామునిన్.
క. తాటక వచ్చిన దదిగో
నాటక నాఁడు దని మేల మాడక నీ వీ
పాటి పడ నేయు మని తన
చాటున భయపడిరామచంద్రున కనియన్. |51|
వ. ఇట్లు చెప్పిన యీ మునిచంద్రుని పల్కు లాలించి రామచం
ద్రుండు తనయంతరంగమ్మున నిట్లని వితర్కించె. |52|
క.ఈయాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి సగరె వీరుల్
చీ యని రోయుచు నమ్ముని
నాయకుభయ మెఱిఁగి తనమమ్మున నలుకన్. |53|
క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొకదిట్టకోల సురల్ నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్య్గ్రలీల ధరపైఁ గూల్చెన్. |54|
వ. ఇట్లు దాటకం గీటణంచినయంత నమ్మునీంద్రుడు మేటి
సంతోషమ్మున రామునిం గొనియాడుచు నశ్రమంబుగ
నిజాశ్రమంబున కేతెంచి రామసౌమిత్రులనాయంబున
జన్నంబు సేయుచున్న సమయంబున. |55|
క.ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమితర క్తముఁ బలలం
బాకౌశికుయజ్ఞముపై
భీకరముగ మునిగణంబు భీతిం బొందన్. |56|