గుచములు బంగారుకుండలో యనుమాట
కల్లగా నగ్రముల్ నల్లనయ్యెఁ *
జంద్రాస్య లనుమాట సరవి మాన్పఁగఁ బోలు
గళలవిలాసమ్ము పలుచ నయ్యె
సుందరు లనుమాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె
తే. ననుచు గనుకొన్నవా రెల్ల నాడుచుండఁ
గట్టుచీరెల వ్రేకంబు పుట్టుచుండ
నానతుల జూచి యందఱు నలరుచుండఁ
గాంతలకు నప్డు గర్భముల్ గానుపించె.
వ. ఇట్లు దుర్భరంబు లైన గర్భంబులు దాల్చిన కేసల్యాదికాఁ
తాత్రయమ్మును జైత్రమాసమ్మున శుక్లపక్షమ్మున నవమీ
భానువారమ్మునఁ బునర్వసునక్షత్రమ్మునఁ గర్కటకలగ్నం
బున శ్రీ రామభరతలక్ష్మణ శత్రుఘ్నులం గాంచినం దదనం
తరంబున దశరధుండు యధోచితక ర్తవ్యంబులు జరిపి యప్పది
దినంబులు నరిష్టంబు లేక ప్రతిదినప్రవర్ధమాన మగుచున్న
కుమారచతుష్టయంబునకుఁ గాలోచితంబు లగుచౌలోపన
యనాదికృత్యంబులు గావించి వెండియ విద్యాప్రవీణు లగు
నట్టు లొనర్చి గజాశ్వరధారోహణంబులు నేర్పి ధనుర్వేద
సారంబులం గావించి పెంచుచున్న సమయమ్మున.
సీ. ఒక నాడు శుభగోష్టి నుర్వీశ్వరుఁడు మంత్రి
హితపురోహితులం నెలమిఁ జేరి
బంధువర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁ జేరి
- ముకురక పోలలు ముగుద లనెడు మాట, కల్లగా జెక్కులు వెల్లనయ్యె.