Jump to content

పుట:Molla Ramayanam.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. పాయసమ్ము రెండుభాగముల్ గావించి
యగ్రసతుల కీయ నందులోన
సగము సగము దీసి ముగుద సుమిత్రకు
నొసంగి రంత నామె మెసవెఁ బ్రీతి 39

వ. అంతం గొన్నిదినంబులకుఁ గౌసల్యకైకేయీసుమిత్రలు
గర్భవతు లై యొప్పాఱుచుండ. 40

సీ. ధవలాక్షు లనుమాట తథ్యంబు గావింపఁ
  దెలు పెక్కి కన్నులు తేట లయ్యె
నీలకుంతల లని నెగడినయామాట
  నిలుపంగ నెఱులపై నలుపు నూపె
గురుకుచ లనుమాట సరవి భాషింపంగఁ
  దోర మై కుచముల నీరువట్టె*
మంజుభాషిణు లనుమాట దప్పక యుండ
  మొలఁతలపలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందుః
మీఱి మేలైనరుచులపైఁ గోరి కయ్యె
సవతిపో రనఁ దమలోన సారె సారె
కోకిలింతలు బెట్టుచిట్టుములుఁ బుట్టె 41

వ. మఱియును. 42

సీ. తనుమధ్య లనుమాటఁ దప్పింపఁ గాఁబోలుఁ
  బొఱలేక నుడుములు పొదలఁ జొచ్చెఁ


శ్రీ. కం. వీరేశలింగముపంతులవారి ప్రతిలోని పాఠములు.

  • మందయాన లనంగ మా నైనయమ్మాట

      నిక్కంబుగా మాంద్యమెక్కెనడల.