పుట:Molla Ramayanam.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దినకరాన్వయపాథోధివజవైరి
నిశికౌక్షేయకకరుండు దశరథుండు.

సీ.వాలింపఁ డవినీతిపరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు
మనుపఁ డెన్నఁడు జోరులను గారవము చేసి
మనుచు నాశ్రితకోటి ఘనము గాఁగ
వెఱ పెఱుఁగఁడు వైరివీరులఁ బొడఁగన్న
వెఱచు బొం కేయెడ దొరలునొ యని
తలఁకఁ డర్థివ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మమ్మెందుఁ దప్పునొ యని

తే. సరవిఁ బోషింపఁ డరిగణషట్క మెపుడు
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రనరుల
భాస్కరాన్వయ తేజోవిభాసితుండు
మానధుర్యుండు దశరథక్ష్మావరుండు.

సీ.కనఁ గోరఁ డొకనాఁడుఁ గన్నురఁ బరవధూ
లావణ్యసౌభాగ్యలక్షణములు
వినఁ గోరఁ డొకనాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారల మీఁది కొండెములను
చిత్తంబు వెడలించు జిహ్వాగ్రమునఁ గోరి
పలుకఁడు కాఠిన్యభాషణములు
తలఁపఁ డించక యైన ధనకాంక్ష నేనాఁడు
బంధుమిత్ర్రాశ్రిత ప్రతతిఁ జెఱుప

తే. సతతగాంభీర్యధైర్యభూషణపరుండు
వార్తకెక్కిన రాజన్యవర్తనుండు