సకలభూపాలజనసభాసన్నుతుండు
ధర్మతాత్పర్యనిరతుండు దశరథుండు. 21
సీ. విరహాతిశయమున వృద్ధిఁ బొందఁగ లేక
విషధరుండును గోఱ విషయముఁ బూనె
తాపంబు క్రొవ్వెంచి తరియింప నోపక
పలుమాఱుఁ గడగండ్లఁ బడియెఁ గరులు
కందర్పశరవృష్టి నంద నోపక ఘృష్టి
వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె
దీపించి వల పాఁప నోపక కూర్మంబు
కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె
తే. కుంభినీకాంత తమమీఁదికూర్మివిడిచి
ప్రకటరాజ్యమస్తకాభరణముకుట
చారుమాణిక్యదీపితచరణుఁడైన
దశరథాధీశుభుజపీఠిఁ దగిలినంత. 22
క. ఆరాజు రాజ్యమందలి
వారెల్లను నిరతధర్మవర్తను లగుచున్
భూరిశ్రీవిభవంబుల
దారిద్ర్యం బెఱుఁగ రెట్టితఱి నేనాఁడున్. 23
వ. ఇట్టిమహాధైర్యసంపన్నుంటును మహైశ్వర్యధుర్యుండును
నగుదశరథమహారాజు సకలసామంత రాజలోకపూజ్యమానుం
డగుచుఁ బ్రాజ్యం బగురాజ్యంబు నేలుచు నొక్కనాడు.
సీ. సంతానలబ్ధికై చింతించి చింతించి
శిష్టవర్తనుఁ డౌవసిష్ఠుఁ జూచి
తనకోర్కి వినుపింప విని మునిసింహుండు
వలికె ఋశ్యగృంగు నెలమిఁ దేర
పుట:Molla Ramayanam.djvu/17
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది