గనుఁగవయట్ల పొల్పెసఁగఁగా భువిబోగులు మెచ్చ భోగినీ
జనములరీతిఁ జెల్వమరు సౌధనికాయము పాయ కప్పురిన్.
తే. మకరకచ్ఛపశంఖపద్మములు గలిగి
ధనదునగరమ్ముపైఁ గాలు ద్రవ్యుచుండు
సరసమాధుర్యగాంభీర్యసరణిఁ బేర్చి
గుఱుతు మీఱినయప్పురికొలఁకు లెల్ల.
తే. అమృత ధారాప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె
అమృతధారా ప్రవాహమ్మునందు నెపుడు
బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు.
క. ఈరణి సకలవిభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాకపురితోడ నొఱయుచు
సాకేతపురమ్ము వెలయు జగము నుతింపన్.
వ. అట్టిమహాపట్టణంబున కధీశ్వరుం డెట్టివాఁ డనఁగ.
సీ. తనకీర్తికరపూరతతి చేత వాసించెఁ
బటుతరబ్రహ్మాండభాండ మెల్లఁ
దనశౌర్యదీప్తిచే నిగబింబ మనయంబుఁ
బగలెల్ల మాఁగుడువడఁగఁ చేసెఁ
దనదానవిఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱఁ దఱిమెఁ
దననీతిమహీమచే జనలోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరె
తే. భళిర. కొనియాడఁ బాత్ర మైపరఁగినట్టి
వైరినృపజాల మేఘసమీరణుండు
పుట:Molla Ramayanam.djvu/15
స్వరూపం
ఈ పుట ఆమోదించబడ్డది