పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

73


అడవిపందికోఱలు, అడవిపండ్లు, వెదురు బియ్యము, వెదురుబెత్తములు. పిల్లనగ్రోవులు, సూదంటురాళ్ళు, ఓషధులు, తేనె మొదలగునాటవిక వస్తువులను నగరములకుఁ గొని వచ్చి యమ్ముచు నప్పుడప్పుడు తమగేయనృత్యవిశేషములను నగరములందును, బల్లెలందును ప్రయోగించుటచే నవి నాగరకదేశములందును వ్యాపించెను.

యక్షగానములు

ఇట్లు నగరములందు నభిరుచి గొల్పినయాగేయవిశిష్టనృత్య దృశ్యములు, జక్కులవారు(యక్షులు, కళావంతులు) తర్వాత నగరము లందును ప్రయోగింపఁ జొచ్చిరి. వీరి ప్రయోగములందు దృశ్య మయిననృత్యాభినయములతోపాటుగా నధికముగా గేయ వచనరూపమైనశ్రవ్యరచనముగూడఁ జేరెను. కురవంజులకంటె యక్షగానములు పర్యాప్తముగా శ్రవ్యము లగుకవిరచనములు గలవి. వీరిరచనములలో బహువిధము లగుపురాణకథ లెల్లఁ జేరినవి. కురవంజులలోని సింగి, సింగఁడుపాత్రలు మాఱి రామ నల హరిశ్చంద్ర సీతా దమయంతీ చంద్రమత్యాదిపాత్రలు వచ్చినవి. కాని వీనిలో నాటవికరచనాసంస్కార సూచకముగా, 'ఎఱుకతసాని’ పాత్రము వెలసినది. కురవంజులలోని దేసిరచనలకంటె నత్యధికముగా వీనిలో దేసిచ్ఛందోబద్ధము లగుగేయ రచనలు ప్రబలినవి. రాజసభలలో, దేవోత్సవములలో, ఊరిజాత్రలలో యక్షగంధర్వాదివేషముల ధరించి [1]వేశ్యలు ప్రదర్శించునవి గావునను, నృత్యధర్మములకంటె గేయధర్మము లధికముగాఁ గలవి కావునను నివి యక్షగానము లనఁబడెను. కళావంతులలో నొక తెగకు నేఁడు జక్కులవా

  1. శ్రీనాథుఁడు భీమఖండమున దాక్షారామభీమేశ్వర మహోత్సవ సమయములందు సానులు (వేశ్యలు) వేషములు వేసికొని నాటకము లాడుట నిట్లు వర్ణించెను.