పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

మీఁగడ తఱకలు

 రనుపేరు గలదు. యక్షాదివేషముల ధరించి నృత్యగానప్రదర్శనములను గావించుటచేతనే వారి కాపేరు వచ్చియుండవచ్చును. శ్రీనాథుఁడు క్రీడాభిరామమున జక్కుల వారిని గూర్చి కొంతప్రశంస నెఱపినాఁడు.

సీ|| కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమధ్వని తార
                      కంఠస్వరంబుతో గారవింప
     మసిబొగ్గు బోనాన వసలుకొల్పినకన్ను
                      కొడుపుచేఁ దాటించు నెడప దడప
     శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ
                      జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ

_________________________________________________________

సీ|| విరులదండలతోడివేణికాభారంబు
                 పొంకంబు పిఱుఁదులఁ బొరలి యాడ
     మణితులాకోటికోమలఝణత్కారంబు
                 రవలి మట్టెలమ్రోఁత యవఘళింపఁ
     గుదురు నిండిన చిన్న గుబ్బచన్నులమీఁద
                 ముత్యాలత్రిసరంబు మురువుఁ జూప
     వలమానతాటంక వజ్రాంకురచ్ఛాయ
                 లేఁతవెన్నెలఁ బుక్కిలించి యుమియ
     సాని యీశానియై మహోత్సవమునందుఁ
     గేల నవచంద్రకాంతపుగిన్నె పూని
     వీథి భిక్షాటన మొనర్చు వేళఁ జేయు
     మరులు నృత్యంబు జగముల మరులు కొలుపు. (ఆ1-105)

వ|| మహోత్సవమండపమునందుఁ బేరోలగం బుండి, కుండలీదండలాసకప్రేరణీ ప్రేంకణసింధుకందక ధమాళి చేల మత్తల్లీహల్లీసకాది నృత్యంబు లవలోకించుచు.

(అ 1 - 118)

శ్రీనాథునికాలమునకే దేవోత్సవాదులయందు వేశ్యలు వేషములు కట్టి నాటకములఁ బ్రదర్శించుసంప్రదాయము ప్రబలినది.

“కీర్తింతు రెవ్వానికీర్తి గంధర్వులు-గాంధర్వమున యక్షగానసరణి (భీమ 3 అశ్వా) శ్రీనాథునికాలమున యక్షగానములు ప్రబలియుండుట దీనిచే దేలియనగును".