పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మీఁగడ తఱకలు


దేశిదృశ్యరచనలు

యక్షగానము లన్నపేరు గలదృశ్యరచనములు నన్నయాదుల కాలమున నున్న వనుటకుఁ బ్రబలాధారములు గానరావు. కాని యా నాఁడేవో కొన్ని దేశిదృశ్యరచనము లున్నవని మాత్రము గుర్తింపనగును. నన్నయ కిన్నూఱేండ్లకుఁ దర్వాత నున్న పాల్కురికి సోమనాధుఁ డిట్లు చెప్పినాఁడు.

"భ్రమరులు జాళెమల్ బయకముల్ మెఱసి
  రమణఁ బంచాంగ పేరణి యాడువారు
  ప్రమధపురాతన పటుచరిత్రములు
  క్రమ మొందబహునాటకము లాడువారు
  లలితాంగ రసకళాలంకారరేఖ
  లలవడ బహురూప మాడెడువారు
  అమరాంగనలు దివి నాడెడుమాడ్కి
  నమరంగ గడలపై నాడెడువారు
  ఆవియద్గతి యక్షు లాడెడునట్టి
  భావన మ్రోకులపై నాడువారు
  భారతాదికధలు చీరమఱుఁగుల
  నారంగ బొమ్మల నాడించువారు
  కడు నద్భుతంబుగఁ గంభనూత్రంబు
  లడరంగ బొమ్మల నాడించువారు
  నాదట గంధర్వయక్షవిద్యాధ
  రాదులై పాత్రల నాడించువారు"
                   పర్వతప్రకరణము - పండితారాధ్యచరిత్రము

పై ద్విపదలందు, నేఁటివీధినాటకములు, దొమ్మరాటలు, తోలుబొమ్మలాటలు మొదలగునవి పేర్కొనఁబడినవి. ఇట్టి సంప్రదాయములు వీనిఁ