పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

మీఁగడ తఱకలు


సంగ్రహమొనర్చి ప్రసిద్ధి కెక్కినచిత్ర కవిపెద్దన్న (హరిశ్చంద్రనలోపాఖ్యానవ్యాఖ్యాత) తాళ్లపాక తిరువేంగళనాథుఁడు (అమరకోశవ్యాఖ్యాత) మొదలగులాక్షణికు లగుప్రాచీనవ్యాఖ్యాత లెల్లరును దమగ్రంథములందు సంస్కార శూన్య మయిన యీభాషనే యుపయోగించుచువచ్చిరి. అప్పటి యావచనరచన లందును గొంతవఱకు వ్యాకరణనిరాకరణ మీకారణముచేతనే సమకుఱి యుండు నని యీవఱకే వాకొనియుంటినిగదా!.

19వ శతాబ్దినుండి మనదేశమున వచన రచన యుపక్రమింపఁ బడినది. చిన్నయసూరిగారు 19వ శతాబ్ది ప్రారంభమునఁ జెన్నపురమునఁ ప్రఖ్యాతపండితులుగా నుండిరి. వీరినాcటనుండియుం గల్పితవచన గ్రంథములు మిక్కిలి వెలువడఁజొచ్చినవి. వారివచనరచన మిక్కిలి సరసమై ప్రౌఢమై సర్వాతిశాయి యై తర్వాతివారి రచనలకు మార్గదర్శక మైనది. ఇంతకంటె సుప్రసిద్ధ మగువీరిరచననుగూర్చి చెప్పఁ బని యుండదు.

చిన్నయసూరిగారి కాలమునఁ జెన్నపురముననే కోలాశేషాచలకవి యను నాతఁడు గోడే వెంకట జగ్గారాయలవారికిఁ గృతిగా నీలగిరియాత్రా చరిత్ర మనునొకహృద్య మగు గద్యప్రబంధమును గల్పించెను. ఈకవి రచన చిన్నయసూరిగారి త్రోవను వెన్నాడుచు మిక్కిలి చక్కగా నున్నది. అతిశయోక్త్యాదికావ్యాలంకారంబులం దొఱంగి కలరూ పెఱింగించువేడ్క నిఖిలజనసుబోధం బగునట్లుగా రచించిన ట్లాతఁడు చెప్పికొనియెను.

ఇంచుక చదివెదను.

"నావిడిదల యగునిలు సొచ్చినయనంతరంబ యెచ్చటఁ గూర్చుండిన నెచ్చటఁ గ్రుమ్మరిన నెద్ది యంటిన నాసర్వం బతిశీతలం బయి గోచరించె నంతఁ గొంతతడవునకె చలి మొలతెంచె. మార్గశ్రమంబున న్విడిదల ప్రవేశించు సమకాలంబునన శీతంబు గోచరింప దయ్యె నని తోcచెను. మఱునాఁడె నాకును నాబాసటయయి వచ్చిన శ్రీనివాస మొదలారికిని స్వదేశంబునుండి కొంపోయిన చలితొడుగు లొడళ్లం దొడిగికొనవలసివచ్చె అచ్చట నగ్ని యొకండు దక్క నెల్లపదార్ధంబులు