పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

53


శరీరధారి యైనయజామీళుని వెఱవకు మని అభయమిచ్చి, యాదరించి పలికిరి. యమభటులును దిట్టలుగనుక, వెనుకకుఁబోయి మఱలివచ్చి, ఆ మకరకుండల, కిరీట, హార, కేయూర, వైజయంతీ, వనమాలికా భరణులైన విష్ణుదాసులఁ జేరవచ్చి 'అయ్యా మీ రెవ్వరివారలు? మమ్మెఱుంగరా పాపకర్మునిఁబట్టి మేము కొంచుకుపోవఁగా అడ్డగించ మీకుఁ బని యేమి యున్నది. యమునిశాసనము మీకు నవ్వులాయెనా?" అనఁగా శ్రీమన్నారాయణుని కింకరులు పలికిరి. "రారోయి యమభటులారా! మీరు ధర్మరాజుదూతలు గనుక గుణవంతులు. మీపలుకులయందుఁ గఠినత్వము లేదు. ఈ బ్రాహ్మణుండు దురాచారి యగును. ఇతండు దండింపఁదగియుండియు దండనకుఁ దగనివాఁడైనాఁడు. దండార్హుం డెవ్వండు? దండింపఁదగనివా డెవ్వండు? ఆత్మకు కర్మానుభవము ఎటువలె కలుగును? వినిపింపుం డనిన కేలుపుణుకుచున్ను యమదూతలు పలికిరి, వినరయ్యా మహాత్మురారా! శ్రీభగవంతునియొక్క వాక్యములు వేదములు. అందు చెప్పఁబడ్డది ధర్మ మనఁబడును. వేదమార్గము తప్పిననే అధర్మమగును. ధర్మమున సుఖమును అధర్మమున దుఃఖమును ప్రాణులు పొందుదురు. ప్రాణి చేసినపాపపుణ్యములకు సాక్షులు సేనా యున్నారు. కర్మ మేవేళ జీవుఁడు సేయునో ఆకాలమే కర్మమునకు సాక్షియై యుండును. కాఁబట్టి తప్పించుక పోఁగూడదు."

ఈ కవియే రచించిన సమీరకుమారవిజయమందున్న వచనమును గూడ నించుక చదివినచో నాతనికి భాగవతసార మెంత తేలికగా నర్థమగునట్లు రచింపవలయు ననునభినివేశము కలదో తేటపడఁగలదు.

సమీరకుమారవిజయమందలి వచనము

“ఇప్పగిది నప్పరమపావనుం డప్పు డుప్పరంబునఁ గప్పుజిగి గప్పిన నాయొప్పిదంబు విప్పగుమెప్పునం దప్పక చూచి ముప్పిరిగొను భక్త్యనురాగసంభ్రమంబుల మత్పరాయణుం డగుటంజేసి యచ్చోటు వాసి