పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

మీఁగడ తఱకలు


మదీయసన్నిధిఁ బెన్నిధిఁ గన్న పేదచందంబున డెందంబు గందళింపఁ దనమనోవృత్తి ననుసరించు శరీరంబు సభృత్యపరివారంబుగా మఱిచి దూరంబున నున్ననన్నుఁ జేరంబూని కూర్చున్న యటుల తద్గగనంబున కుద్గమించునయ్యంచితాత్ము సంచరణంబున."

మనుచరిత్రమునకుఁ దర్వాత రచింపఁబడుచు వచ్చిన ప్రబంధము లందలి గద్యములు తఱచుగా నీ తెఱఁగుననే యుండును.

ఈ తిమ్మకవియు దక్షిణదేశవువాఁడో యని సందియము కలుగు చున్నది.

ఎరశూర్ యమ్మావాద్యార్ చిన్నయ యనునతఁ డీతని భాగవత సారమును ద్రావిడభాషలోని కనువదించెను. ఆ ద్రావిడానువాదమున నిట్టు కలదు. "ఇందె పన్ని రెండు కందంగళుం, శ్రీకృష్ణప్రీతియాయ్, తెలింగిలెయుం పుష్పగిరి తిమ్మయ్యర్ పణ్ణినది పార్తు ఎరశూర్ యమ్మావాద్యార్ శిన్నయ్య తమళ్ వచన మాహ పణ్ణినదు."

ఈ పుష్పగిరి తిమ్మకవి 18వ శతాబ్ది మధ్యమున నున్నవాఁ డని శ్రీవీరేశలింగము పంతులవారు వ్రాసియున్నారు. కంకంటి పాపరాజు నుత్తరరామాయణమునకు, విష్ణుమాయావిలాసమునకు, నీకవి సమీర కుమారవిజయమునకు నూఱు సంll పైబడినకాలమున వ్రాయఁబడిన భిన్నదేశపుcదాళపత్రప్రతులు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునఁ గలవు. 200 సం|| పూర్వము వ్రాయఁబడిన తాళపత్రపుఁబ్రతులు నైజాం దేశమునందు బ్రహ్మశ్రీమానవల్లిరామకృష్ణకవిగారు సంపాదించినట్లు చెప్పుచున్నారు. భాగవతసారపు ద్రావిడభాషానువాదమునకే ప్రాఁబడిన తాళపత్రప్రతులు చూపట్టుచున్నవి. కావునఁ గంకంటి పాపరాజకవియు, పుష్పగిరి తిమ్మకవియు, నంతకంటెఁ బూర్వులై యుందురు. తిమ్మకవి భాగవతసారము ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున నసమగ్రముగాఁ గలదు.