పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

మీఁగడ తఱకలు

ఈవిజయరంగచొక్కభూపాలుకాలమున నింక ననేక వచన కావ్యములు రచింపఁబడినవి. మిత్రవిందాపరిణయమును రచించిన కుందు వెంకటాచలకవియు నీతని యాస్థానమం దున్నవాఁడే, ఈతcడు

సీ|| "చదివినా వేమేమి చదువ యోగ్యంబులో
                  యవి యెల్ల నిస్సంశయంబు గాఁగ,
       వచనకావ్యములుగా రచియించినావు భా
                 రతభాగవతములు రామకథయు.”

అని విజయరంగచొక్కభూపాలుఁడు తన్నుమెచ్చినట్లు చెప్పుకొనెను. ఈతని భారత, భాగవత, రామాయణ వచనములు మనకు లభింపవలసి యున్నవి.

పదపడి సమీరకుమారవిజయ మను ప్రౌఢప్రబంధ మొనర్చిన పుష్పగిరితిమ్మనార్యుఁడు భాగవతసార మను వచనకావ్య మొనర్చెను. ఉత్తరరామాయణము నొనర్చినకంకంటిపాపరాజకవి కీతఁడు మిత్రము. ఈతని భాగవతసారము సంస్కృతాంధ్రభాగవతములకు మిక్కిలి సంగ్రహముగా నున్నది. ఇందలివచనశైలి మిక్కిలి తేలికగాc దేటగా నింపు గూర్చుచున్నది. రచనాప్రౌఢిమ నీగ్రంథమందు తిమ్మకవి చూపలేదు. వ్యాకరణమును మీఱిన ప్రయోగము లందం దిందుఁ గన్పట్టుచున్నవి. ఇంచుక మచ్చు చూపుచున్నాఁడను.

భాగవతసారము

షష్ఠస్కంధము

“ఆలో యమకింకరులు అఘోరయమపాశమున నతనిని గట్టిగాఁగట్టి, కొంపోవ నుద్యోగించఁగా, నంతలో ఆజానుచతుర్బాహులు, నీలమేఘశ్యాములు, సుగుణాభిరాములు, అమితదయాళురు, విష్ణుదూతలు వచ్చి, ఆపాశము త్రెంచి పాఱవైచి, యమదూతలఁ బాఱఁద్రోలి, యాతనా