పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

మీఁగడ తఱకలు

మఱియు, నన్నయాదికవీశ్వరులు ప్రాసములం దెక్కడను బూర్ణబిందువును నర్థబిందువును బొందింపరయిరి. శివకవుల గ్రంథములలో నది కానవచ్చుచున్నది.

క|| పోఁడిగ నగజతపశ్శిఖి
     మూఁడు జగమ్ములను దీవ్రముగఁ బర్విన బ్ర
     హ్మాండము గాఁచిన కాంచన
     భాండము క్రియదాల్చెఁ దత్ప్రభాభాసితమై,
                                            -కుమారసంభవము
 
     పాండురాంగంబైవ పడఁతిగర్భమునఁ
     బోఁడిగా వెలుఁగుచుఁ బుత్రుం డీక్రియను.
                                            -బసవపురాణము
     ఇత్యాదులు పెక్కు లున్నవి.

ಇట్టి ఛందోలక్షణవిశేషములుగాక, శబ్దప్రయోగములందునుగూడ శివకవులకు నితరకవులకుఁ బెక్కు భేదము లున్నవి.

శబ్దప్రయోగములు

తెఱఁగువోలె, వడువువోలె, - ಇట్టి ప్రయోగములు శివకవుల గ్రంథములందే నాకుc గానవచ్చినవి.

"తెరువు దాఁ దీర్చిచూపెడు తెఱఁగువోలె
 బలసికొలువున్న సురగిరిభంగివోలె
 నందనవనము గాపువచ్చు వడువువోలె
 పాలకడలిలో నిల్చిన భంగివోలె-"
                                    -కుమారసంభవము

"వచ్చువహిత్రంబు వడువునుబోలె
 కరమర్ధి నందిచ్చుకరణియుcబోలె-"
                                      -బసవపురాణము

పూంచు, పూన్చు,-ఈధాతువు నన్నయాదికవీశ్వరుల గ్రంథములందుc బెక్కుచోట్లఁ బ్రయోగింపఁబడియున్నది. అది పూను ధాతువప్రేరణరూపము.