పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

15


పూనఁజేయుట దాని యర్ధము. ‘అరదము పూంచి' ఇత్యాది ప్రయోగము లున్నవి. శివకవుల గ్రంథములందెల్ల నీధాతు వింకొక యర్ధమునఁ బ్రఖ్యాతముగాఁ గానవచ్చుచున్నది. పూన్చు = పూజించు. ఈ ధాతువు నీయర్ధమున నన్నయాదులు ప్రయోగించినట్లు కానరాదు.

క|| కన్ను వడిఁబుచ్చి పూన్చిన
     వెన్నుని భక్తికి వరంబు వెదచల్లుక్రియన్

క|| మొఱటద వంకయ దనతల
     లఱిమెల్వడఁ దఱిగి నీపదాంబుజములఁ గ్ర
     చ్చఱఁ బూన్చి మగుడఁ బడయఁడె.

క|| ఉన్నతభక్తి శిరంబులఁ
     బన్నుగ శివుఁ బూన్చి కరుణcబడసినభంగిన్
     ము న్నేవిధులం గొలిచియుc
     జన్న దశాననుఁడు వడయఁజాలెనె చెపుమా,
                                             -శివతత్త్వసారము.

చ|| హరి వికచామలాంబుజ సహస్రము పూన్చి
                                           - కుమారసంభవము.

    -ద్విపదాంబురుహముల ధృతిఁ బసవేశు
    ద్విపదాంబురుహము లతిప్రీతిఁ బూన్తు
    ఈపద్మములఁగాదె యింతి యాకుంతి
    పాపారిఁబూజించి బడసెఁ బాండవుల
    చెండి యీపద్మముల్ శివుఁ బూన్చి కాదె
    సుందరి భృగుపత్ని శుక్రునిఁబడసె
    అదిగాక యీపూల హరుఁ బూన్చి కాదె
    సుదతి కౌసల్య సత్సుతు రాముఁ బడసె.
                                             - పండితారాధ్యచరిత్ర.

పూజించుట యందుఁ బూన్చు ప్రయోగము శివకవుల గ్రంథములలోc బెక్కు చోట్లఁ గలదు.