పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

మీఁగడ తఱకలు


(ఘన్) పదమునకు వీర్యవంతుc డనుటయే ముఖ్యార్ధము. ఆయర్ధముననే యది యౌపచారికముగా వివక్షాయత్తముగాఁ గొన్ని దేశములలోఁ గొన్ని కాలములలోc- బెనిమిటికిని, భర్త ముసలివాఁ డైనపుడు యువకుc డుగా నున్న కుమారునికిని వాచక మయినది. నేఁటికినిగూడ నిట్టి పురుషసామాన్యార్ధమున నీ పదము తెల్గువ్యవహారమునఁ గలదు.

ఇంట మగదిక్కు లేదు-మగకొడుకు=పురుషుఁడు (భర్తయే, యొండె, కొడుకే అనికాదు అర్థమిక్కడ) మగమొల్క (కళాపూర్ణో-) మగలరాజు - (కుమార). ఈ పదము నేఁడు పెనిమిటి యన్నయర్ధమున వ్యవహృత మగుచున్నట్లే ప్రాచీన వ్యవహృత మగుచుండెడిది.

‘అన్న' యన్న పదము అగ్రజునకుఁ దండ్రికిఁగూడ నేఁ డాంధ్ర దేశమున భిన్నస్థలములలో వ్యవహృత మగుచున్నది. అట్లే. బాబు' అన్న పదముకూడఁ దండ్రికిని, దండ్రితమ్మునికి, లేక పినతల్లి భర్తకు వ్యవహారమున నున్నది.

అప్ప = తండ్రికిని - అక్కగారికిని

అక్క= తల్లికిని - అక్కగారికిని

మఱియు నీ పదము లెల్లఁ బూజ్యార్ధమున నెల్లరియెడఁ గూడ వ్యవహృత మగుచునవి. వీనినిఁబట్టి ప్రాచీనకాలపు వింతసంబంధముల లెక్కింపరాదు.


★ ★ ★