పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

163

అరవమున 'త' తాయ్, - అది ద్విరుక్తము కాఁగాఁ దండ్రి పేరై - తందాయ్ - తందై - అయినది - తాన+తాన తందాన అయినట్లు. ఈ పదము లన్నిటికి తుద 'ఆయ్‌' ఉండుట ద్రవిడోచ్చారసంప్రదాయము. దానిఁబట్టి అమ్మ-అమ్మాయి, మామ-మామయ, అన్నాయ్, అక్కయ, అక్కాయ్, అక్కయ్య, అబ్బాయి, పాపాయి, బాబాయి రూపము లేర్పడినవి. తాయ్+తాయ్ ద్విరుక్తిచే నేర్పడిన 'తందై' శబ్దమునుండియే - ప్రౌఢులభాషలో - 'తండ్రి' శబ్దము పుట్టినది. ఎ ట్లనఁగా తెల్గుభాషలో ప్రథమావిభక్తి తర్వాతికాలమున బహువచనరూపముతోనే యుప్పతిల్లినది. ఒన్‌ఱు, ఇరన్‌ఱు, మూన్‌ఱు-ఇందు 'ఱు' (బహువచన) ప్రత్యయము ఏకవస్తువాచక మయిన - ఒన్ పదము మీఁద కూడ నిది వచ్చినది. ద్వివచనము ద్రవిడభాషలలో లేదు గాన ఇరన్+ఱు అనుచో నా (బహువచన) ప్రత్యయ ముండఁగూడును. మూన్+ఱు లోను నుండవచ్చును. తెలుఁగు భాషలో నకారపొల్లు రేఫము సంధించినపుడు ఆయక్షరద్వయ సంధి సంఘర్షమువలన నడుమ డకార మవతరించును. పన్+రెండు-పండ్‌రెండు - పండ్రెండు, అవన్(వాన్)+ఱు-వాన్‌డ్‌ఱు-వాండ్ఱు; ఇందలి బహువచన రూపము 'ఱు’ లోపింపఁగా 'ఒండు' అయినది. అట్లే రెండు, మూండు రూపముల నిష్పత్తి కూడ. ఈ పద్ధతి చొప్పున 'తందై' తొలిరూపము. 'తందె' తర్వాత రూపము (కన్నడము). తందె తంది అయి దానిపై బహువచనపు 'ఱు' చేరఁగా తందిఱు ప్రాతిపదికపు తుది ఇకారమునుబట్టి 'రి'గా మాఱినది. ఒక్క ప్రత్యయమే యయినను (చేతు+రు, చేసి+రి అయినట్లు) తంది+రి-తందిరి, తండిరి అయినది. తుదకు ఉండిరి-ఉండ్రి యయినట్లు తండిరి-తండ్రిగా మాఱినది.

మగఁడు- సర్వభాషలలోఁ దదర్థకపదము కృత్రిమమే. అది ముగ్ధశిశుభాషలో నుప్పతిల్లవలసినపదము కాదు. అది 'మహాన్‌' వికృతి కావచ్చును. అక్కడ మహత్త్వము వీర్యవత్త్వరూపము. మగన్ (హన్) ఘన్