పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

133


శృంగారరసైకమయమై పలుచబడినది. గుజిలీపుస్తకములలోఁ బెద్దిదాసు చరిత్ర మని యొక లఘుగ్రంథము ముద్రితమై దొరకుచున్నది. అందుఁ గథానాయకుఁడు పెద్దిదాసు. విజయరాఘవనాయకుని నాఁటివాడు. అతఁడు మహాభక్తుఁడు. విజయరాఘవనాయకుఁ డాతని గేలిచేసి యాతని వేషమును గాడిదకుఁ గల్పించి యూరేగించి, యవమానపఱిచెనఁట! ఆభక్తుని సంకీర్తనములు, రాయని యువకరపుజెయ్దమును నాలఘుకృతిలోఁ గననగును. భక్తు నొకని నట్లు పరిహసించుటచేతనే యాతని రాజ్య మంతరించె ననికూడ నందున్న ట్లున్నది. అం దెంత సత్యము గలదో కాని యాతడు సంగీతసాహిత్యాదిలోలుఁ డగుట తథ్యము. ఆతనినాఁటి కృతులు చాల యక్షగానములు. రఘునాథనాయనిచరిత్రము నాతఁడు ద్విపదకావ్యముగా రచించినాఁడు. ఇప్పటి కించుమించుగా నలువదియేండ్లకు ముందు నే నాయాగ్రంథము లెల్లను బరిశీలించి ముఖ్యాంశములు వ్రాసికొని వచ్చితిని. రఘునాథరాయచరిత్రమందలి తంజావూరి రాచనగరి వర్ణనాదులఁ బట్టి యాయా రాజసభాదిస్థానములను గుర్తించి యప్పు డక్కడి పండితులకుఁ బ్రజలకు వాని నెఱుకపఱిచి వచ్చితిని. 'తంజావూరి యాంధ్రరాజల' చరిత్ర మని పుస్తకమగా నాయావిషమముల సంగ్రహమును బ్రకటించితిని. అప్పటిసేకరణములోని విశేషములనే యిందు వెల్లడించు చున్నాను. విజయ రాఘవనాయనినాఁ టి యక్షగానములలో రచనా చమత్కృతులు కొన్ని:

విజయరాఘవుపట్టంపుఁగవి యైనకామర్సువెంకటపతి సోమయాజి 'విజయరాఘవచంద్రికావిహారము'న-