పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

మీఁగడ తఱకలు

"పాద మూనినచోటఁ బగడాలధగధగ
            లింపారఁ బుటికెల నింపవచ్చుఁ
 గేలు సోకినచోటఁ గెంపులచకచకల్
            సొంపార గంపల ముంపవచ్చు
 నంగ మంటినచోట నపరంజిధళధళల్
            పొంగార గాదెలఁ బోయవచ్చు
 నిక్కి చూచినచోట నీలాలనిగనిగల్
           నిండారఁ గణజాల నింపవచ్చు

 నాత్మభూయత్న రుచిత మోహారివిభవ
 పూర మాటోప మేజాడc బొగడువాcడ
 నింద్రజాలంబొ మాయయో యెఱుఁగ నైనఁ
 జూడఁగలుగుట మామకసుకృతఫలము."

“వచ్చినాఁ డమ్మ నీ వాంఛితాఖిలపూర్తి
            వైభవంబున దేవవల్లభుండు
 చనుదెంచె నమ్మ నీ సౌభాగ్యమలరింప
            వరతేజమున హవ్యవాహనుండు
 వేంచేసె నమ్మ నీ వేడుక లీడేర
            దాక్షిణ్యవర్తన ధర్మరాజు
 ప్రాపించె నమ్మ నీ భాగ్యంబు ఫలియింప
           రత్నసంపద సింధురా జటంచు

 వలపు దెలియంగ నమరశంభళులు దెలుప
 విప్రవరసూక్తి విధృతజీవితఫలంబు
 న్యాయవర్తనమహిమ నన్నలవిభుండు
 హరిదయావహమూర్తి గా కన్యుఁ డగునె?"

రఘునాథరాయని కుమారుcడు విజయరాఘవనాయcడు చాల రసికుఁడు. సంగీతసాహిత్యకవితాగాననాట్యనాటక వినోదపరాయణుఁ డగుటే కాక వైష్ణవమతైకాభిమానమహితుఁడై విష్ణ్వాలయములకే విశేష వైభవము గల్పించుచు వెలుఁగొందెను.అతనికాలమున నంధ్రకవితారచన